కోవిడ్ మూడవ దశ ను ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలి…

ప్రచురణార్థం

కోవిడ్ మూడవ దశ ను ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలి…

మహబూబాబాద్ జనవరి 3.

కోవిడ్ మూడో దశ ఎదుర్కొనేందుకు వైద్య అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జిల్లా ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ భూక్య వెంకట రాములు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డాక్టర్ల సమావేశం లో పాల్గొని వైద్య సౌకర్యాలపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిద్ మూడవ దశ ఎదుర్కొనేందుకు వైద్య అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా ఆవిర్భావ అనంతరం 250 బెడ్స్ కు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నీ అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోగా, అంచెలంచెలుగా ఆధునిక వైద్య సామాగ్రి సమకూరుస్తూ వైద్య సౌకర్యాలను మెరుగుపరుస్తూ నిర్మాణాలను 100 నుంచి 180 బెడ్స్ కు పెంచడం జరిగిందన్నారు. అదేవిధంగా వైద్యులు వైద్య సిబ్బంది పెంచుకుంటూ వస్తున్నామని, దాతల సహకారంతో ఆక్సిజన్ సేవలు ఏర్పాటు చేసుకుంటూ మరోవైపు ప్లాంట్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు నిరుపేదలకు అందుబాటులో 56 రకాల రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించేందుకు తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి రక్త పరీక్షలు నిర్వహించేందుకు నమూనాల సేకరణ కొరకు లక్ష్యాలను కూడా నిర్దేశించుకోవడం జరిగిందన్నారు.

జిల్లా కేంద్రంలో తొర్రూర్ రోడ్డు లో మెడికల్ కళాశాల మంజూరు కాగా పనులు శరవేగంగా జరుగుతున్నాయని, కళాశాలలకు అనుబంధంగా చేపట్టిన నర్సింగ్ కళాశాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు టీచింగ్ ఆసుపత్రిగా ప్రధాన ఆసుపత్రి పైభాగంలో అదనపు బెడ్స్ నిర్మాణ పనులను టీఎస్ midc ఇంజనీరింగ్ అధికారులతో చేపట్టడం జరిగిందన్నారు.
బెడ్స్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు నిరంతరం సమీక్షిస్తున్న మన్నారు.
వైద్య సేవలు నిరుపేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య సిబ్బంది శానిటేషన్ సిబ్బంది కొరకు చర్యలు తీసుకుంటామన్నారు

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు భూక్య వెంకట్రాములు ఉప వైద్యాధికారి అంబరీష జిల్లా కోవిద్ నోడల్ అధికారి విక్రమ్ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు
—————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post