కోవిడ్ మూడవ విడత వచ్చినా ఆక్సిజన్ సమస్య రాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డి.హరిచందన అన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ డి హరిచందన జిల్లా ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన నూతన ఆక్సిజన్ ప్లాంట్ ను సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆక్సిజన్ అందక పోవడం తో కొంతమంది ప్రాణాలను కోల్పోవడం జరిగిందని గుర్తు తెచ్చుకున్నారు. అందుకే కోవిడ్ సెకండ్ వెవ్ పూర్తి కాకముందే ప్రాణవయువు కొరత తో ఏ ఒక్క రోగి ప్రాణాలను కోల్పోకుండా ఉండాలనే ఉద్యేశం తో కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి కేర్( ప్రధాన మంత్రి నిధి) DRDO సహకారం తో రాష్ట్రం లోని ప్రతి జిల్లా కు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను కేటాయించారన్నారు. అందులో భాగంగానే నారాయణపేట జిల్లా కు 15 వ తేది నాడు జిల్లా ఆసుపత్రికి కు 500 లీటర్ ఫర్ మీనిట్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ చేరింది .ఇప్పుడు జిల్లా కేంద్రం లో ఉన్న 100 బెడ్లకు సరిపడా ఆక్సిజన్ ఉత్పతి చేసుకోవచ్చని సూచించారు. ఆసుపత్రి సూపరిండెంట్ వివరిస్తూ ఆసుపత్రి లో ప్రతి బెడ్ కు ఆక్సిజన్ అందించాలనే ఉదేశ్యంతో ప్రతి బెడ్ కు 6 లీటర్ ఫర్ మినిట్ ను అందించగలమని, ఆక్సిజెన్ పైప్ లైన్ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని కలెక్టర్ కు తెలిపారు. త్వరగా పనులను పూర్తి చేసి వినియోగం లోకి తిసుకోరా వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్ల ఆసుపత్రి లో వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణం ను పరిశీలించి ఆసుపత్రి పరిసరాలు పరిశుబ్రంగా ఉంచాలని కమిషనర్ భాస్కర్ రెడ్డి కి సూచించారు.
ఈ కార్యక్రమమ లో ఆసుపత్రి సూపరిండెంట్ మల్లికార్జున్, డాక్టర్ రంజిత, సరోజ నర్సింగ్ సుపర్దేంట్, వైడుర్యం తదితరులు ఉన్నారు.