కోవిడ్ వలన అనాథలైన పేదకుటుంబాలకు స్వచ్చంద సంస్థల సహకారం మరువలేనిది- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

కోవిడ్ వలన అనాథలైన పేదకుటుంబాలకు స్వచ్చంద సంస్థల సహకారం మరువలేనిదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సేల్స్ ఫోర్స్ ఆర్థిక సహకారంతో యునైటెడ్ వె అఫ్ హైదరాబాద్ ద్వారా గురువారం రోజున స్థానిక టీటీడీసీ లో 15 కుటుంబాలకు కలెక్టర్ చేతులమీదుగా యూనిట్ లను అందించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గత రెండు సంవత్సర పాటు కోవిడ్ వలన ఎంతోమంది సమస్యలు ఎదుర్కొన్నారని, మరణాలు సంభవించాయని తెలిపారు. జీవనోపాధి కొరకు సేల్స్ ఫోర్స్ ఆర్థిక సహాయంతో యునైటెడ్ వె అఫ్ హైదరాబాద్ ద్వారా 7 లక్షల రూపాయలతో 15 యూనిట్ లను 30 వేల రూపాయల చొప్పున అనాధ కుటుంబాలకు అందించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కుటుంబాలను స్వచ్చందంగా ఆదుకునేందుకు కంపెనీ లు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగ తరపున సహకారం అందిస్తామని తెలిపారు. నిత్యావసర సరుకులు, టీ స్టాల్, టైలరింగ్, ఫ్లోర్ మిల్, గార్మెంట్స్, కూరగాయల దుకాణం, ఇస్త్రీ పెట్టెలు, మినీ కిరాణం, తదితర యూనిట్ లను కలెక్టర్ ఆయా కుటుంబాల వారికీ పంపిణి చేశారు. ఇంటర్మీడియేట్ చదువు కొరకు 8 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ధ్రువీకరణ పాత్రలను కలెక్టర్ అందించారు. ఈ స్వచ్చంద సంస్థ గతంలో పది పడకల ICU యూనిట్ లను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. యునైటెడ్ వె అఫ్ హైదరాబాద్ సీనియర్ అసోసియేట్ రాములు మాట్లాడుతూ, మారుమూల ఆదిలాబాద్ జిల్లాలోని పేదలకు జీవనోపాధుల కోసం స్వచ్చంద సంస్థ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాజేంద్ర ప్రసాద్, సంస్థ అసోసియేట్ సాయికిరణ్, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post