కోవిడ్ వలన గత సంవత్సరం బతుకమ్మ పండుగ జరుపుకోలేక పోయామని ఈ నెల 7వ తేది నుంచి జిల్లా కేంద్రం లో బతుకమ్మ పండుగను జరుపుకుందమని జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి

బతుకమ్మ 7 వ తేది నుంచి ప్రారంభం

కోవిడ్ వలన గత సంవత్సరం బతుకమ్మ పండుగ జరుపుకోలేక పోయామని ఈ నెల 7వ తేది నుంచి జిల్లా కేంద్రం లో బతుకమ్మ పండుగను జరుపుకుందమని  జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి అన్నారు.

సోమవారం సాయంత్రం అదనపు కలెక్టర్ చాంబర్ లో నిర్వహించిన సమావేశం లో బతుకమ్మ కార్యక్రమన్ని ప్రతిష్టాత్మంగా నిర్వహించాలని అధికారులకు కేటాయించిన బతుకమ్మ కార్యక్రమన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.

వివిధ శాఖలకు కేటాయించిన తేదీలలో వారు బతుకమ్మ కార్యక్రమం లో పాల్గొనాలని సూచించారు. అలాగే అధికారులే కాకా ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొనే చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశానంతరం భారం బావి దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో డిఅర్దిఒ గోపాల్,జిల్లా అధికారులు లియాఖత్ అలీ,వేణుగోపాల్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post