కోవిడ్ వల్ల మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ గ్రేషియాకోసం అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నియమనిబంధనల మేరకు అర్హులైన వారందరికి ఎక్స్ గ్రేషియా అందించేలా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

నవంబరు, 18,ఖమ్మం:

కోవిడ్ వల్ల మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ గ్రేషియాకోసం అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నియమనిబంధనల మేరకు అర్హులైన వారందరికి ఎక్స్ గ్రేషియా అందించేలా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో వైద్య అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కోవిడ్- 19 ఎక్స్ గ్రేషియాకోసం ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తులను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్-19 వల్ల చనిపోయిన వ్యక్తికి సంబంధించిన దరఖాస్తు దారులు చనిపోయిన వ్యక్తియొక్క మరణ ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, కోవిడ్-19 పాజిటీవ్ నిర్ధారణకు సంబంధించి. ఆర్.ఏ.టి.ఆర్.టి.పి.సి.ఆర్/హెచ్.ఆర్.సిటి.స్కాన్ రిపోర్ట్/ఆసుపత్రి కే స్ షీట్/ ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన మెడికల్ రిపోర్ట్స్ ధృవీకరణ పత్రములలో ఏదైనా ఒక్క ధృవీకరణ పత్రంతో మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకునే వ్యక్తికి సంబంధించిన ఆధార్కార్డు, దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుందని ఇట్టి ధృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి అర్హత కల వారందరికీ ఎక్స్ గ్రేషియా మంజూరుకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి కోవిడ్-19 వల్ల మృతిచెందిన వారికి సంబంధించి ధృవీకరణ పత్రములు అవసరమైన వారు జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ఆర్.ఎం.ఓను సంప్రదించి తగు నిర్ధారణ ధృవీకరణ పత్రములు పొందవచ్చని, అదేవిధంగా జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్-19 ఐసోలేషన్ వార్డు నోడల్ అధికారి డా॥సురేష్ (సెల్.నెం.9849145950)ను సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇతర వివరాలు, సందేహాల నివృత్తికి గాను ఐ.డి.ఎన్.పి. ప్రోగ్రాం అధికారి డా॥రాజేష్ (సెలెనెం. 9652759857)ను సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥వెంకటేశ్వర్లు, జిల్లా సర్వేలెన్స్ అధికారి రాజేష్, డా॥ సైదులు, కోవిడ్-19 ఐసోలేషన్ వార్డు నోడల్ ఆఫీసర్ డా॥సురేష్, శ్రీమతి నిలోహన తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post