కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జిల్లా లక్ష్యాలను అధిగమించాలి…

ప్రచురణార్థం

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జిల్లా లక్ష్యాలను అధిగమించాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 15.

కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ని ప్రజ్ఞ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు వైద్య అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులతో కోవిడ్ వ్యాక్సినేషన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుండి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్పెషల్ డ్రైవ్ పడుతున్నందున మండల ప్రత్యేక అధికారులు మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రాథమిక వైద్య కేంద్రాల పరిధిలోని గ్రామ పంచాయతీల వారీగా ప్రణాళిక రూపొందించాలని వ్యాక్సినేషన్ వేసుకొని వారిని గుర్తించి నివేదిక రూపొందించాలన్నారు.

రానున్న ఇరవై రోజుల్లో వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతిరోజు జిల్లాలో 50,500 వ్యాక్సినేషన్ జరగాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రతి పీహెచ్సీ సెంటర్లో aefi కిట్టు ను తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలి అన్నారు.
రెండు మండలాలకు ఒక ఆర్ బి ఎస్ కే వాహనం ఉంటుందని అలాగే 108 వాహనాలు కూడా అందుబాటులో ఉంచామన్నారు.

కలెక్టర్ కార్యాలయంలో వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకునేందుకు అలాగే ప్రజలకు సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

స్పెషల్ డ్రైవ్ లో ప్రతి సబ్ సెంటర్ లో 100 నుండి 150 డోసులు ప్రతి పిఎస్సి కేంద్రంలో 200 నుండి 300 డోస్ లు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా జరగాలన్నారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరమని అధికారులకు సహకరించాల్సిందిగా కలెక్టర్ కోరారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలని విస్తృత ప్రచారం చేయించాలని సర్పంచులను ఆదేశించారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

అనంతరం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా చేపడుతున్న అందుకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్లు దాటి నందుకు ఈ శుభ సందర్భంలో కలెక్టర్ కేక్ కట్ చేసి వైద్యాధికారులకు తినిపించారు ఇదే స్ఫూర్తితో అధికారులు అంకితభావంతో పనిచేసి జిల్లా కీర్తి ప్రతిష్టలను పెంచాలన్నారు

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ డి ఆర్ డి ఏ పి డి సన్యాసయ్య జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు పంచాయతీ అధికారి రఘువరన్ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు
—————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post