కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

ప్రచురణార్థం-3
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 04: సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 18 వ వార్డులో ఏర్పాటు చేసిన సబ్ సెంటర్, వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. సిబ్బందితో వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా ఎంత మందికి రోజుకు వ్యాక్సినేషన్ వేస్తున్నారు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ కేంద్ర పరిధిలో ఇంకనూ మొదటి డోస్ తీసుకొనని వారి వివరాలు అడిగారు. జాబితా ప్రకారం వ్యాక్సిన్ తీసుకొనని వారి ఇంటింటికి వెళ్లి, వ్యాక్సిన్ వల్ల ప్రయోజనాలను అవగాహన చేసి, వ్యాక్సిన్ తీసుకునేలా సమీకరించాలన్నారు. రెండవ డోస్ కు అర్హులైన వారిని గుర్తించి వారు వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని, ఇట్టి విషయమై ప్రతిఒక్కరిని చైతన్య పరచాలన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
అదనపు కలెక్టర్ తనిఖీల సందర్భంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, శ్యామ్ సుందర్ రావు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు వున్నారు.

Share This Post