కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాలను డిసెంబర్30లోగా పూర్తిచేయాలి:: రాష్ట్ర వైద్యారోగ్య , ఆర్థిక శాఖ మంత్రి టీ.హరిష్ రావు

ప్రచురణార్థం-2 తేదీ.1.12.2021

కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాలను డిసెంబర్30లోగా పూర్తిచేయాలి:: రాష్ట్ర వైద్యారోగ్య , ఆర్థిక శాఖ మంత్రి టీ.హరిష్ రావు


జగిత్యాల డిసెంబర్ 1:

కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాలను డిసెంబర్30లోగా పూర్తిచేయాలి:: రాష్ట్ర వైద్యారోగ్య , ఆర్థిక శాఖ మంత్రి టీ.హరిష్ రావు

-కోవిడ్-19 వ్యాక్సినేషన్ లక్ష్యాలను త్వరితగతిన డిసెంబర్30లోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టీ.హరీష్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్, తదితర అంశాలపై రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమిక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి జరుగుతుందని , రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ,ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ప్రపంచంలో నూతన కరోనా వేరియంట్ వ్యాప్తి నివారణకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం చాలా ముఖ్యమని, డిసెంబర్ చివరి వరకు 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ లను వైద్యారోగ్య శాఖ మంత్రి ఆదేశించారు.

రెండవ డోస్ వ్యాక్సినేషన్ అంశంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో గ్రామాలు మండలాల మధ్య పోటీతత్వం పెంచాలని, 100% వ్యాక్సినెషన్ తన గ్రామాల్లో మండలాలను ప్రకటించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. జిల్లాలో తక్కువ వ్యాక్సినేషన్ అవుతున్న మండలాలు, పీహెచ్ సిలను వైద్య ఆరోగ్య శాఖ అధికారి , ప్రోగ్రాం అధికారులు, డిసిహెచ్ఎస్ లు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ఐటి పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, కరోనా మొదటి రెండు దశల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో సామాజిక మాధ్యమం లో పుకార్లు ప్రచారం కాకుండా చర్యలు తీసుకోవాలని, అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండాలని, ఒమిక్రాన్ గురించి వస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని తెలిపారు.కరోనా చికిత్స కోసం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలకు సంబంధించిన అంశాలతో ప్రతి జిల్లాలో బులిటెన్ విడుదల చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి సూచించారు. కరోనా ఎదుర్కోవడానికి 24×7 పని చేసే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ అంశంలో క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య పోటీతత్వం పెంపొందించాలని, జిల్లా వారీగా వ్యాక్సినేషన్ లక్ష్యాలు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో వ్యాక్సినేషన్ తీసుకొని ప్రజల వివరాలు సేకరించి సంబంధిత ప్రజాప్రతినిధులకు అందించాలని, వారితో సమన్వయం చేసుకుంటూ 100% వ్యాక్సినేషన్ పూర్తిచేసే దిశగా పనిచేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థల్లో 95% టీచింగ్ నాన్-టీచింగ్ స్టాఫ్ కు వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల్లో 2 రోజులు ప్రత్యేక వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించి టీచింగ్ నాన్-టీచింగ్ స్టాఫ్, 18 సంవత్సరాలు పైబడిన విద్యార్థులందరికీ 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్, గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు అన్ని పాటించాలని మంత్రి పేర్కొన్నారు.

అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వ్యాక్సినేషన్ పై జిల్లాల వారీగా రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వం వివిధ జిల్లాలో సబ్ సెంటర్లు నిర్మాణ, రేడియాలజీ ల్యాబ్లు, ఏరియా ఆసుపత్రి విస్తరణ,ఆర్టిపిసీఆర్ ల్యాబ్లు మంజూరు చేసిందని వాటికి సంబంధించిన స్థలాలను వైద్యశాఖకు త్వరగా అందేలా కృషి చేయాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జి.రవి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి, జడ్పీ సీఈవో జిల్లా విద్యాశాఖాధికారి , జిల్లా పంచాయతీ అధికారి , సంబంధిత మున్సిపల్ కమిషనర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చేజారి చేయబడినది

Share This Post