కోవిడ్ వ్యాక్సినేషన్ లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం…..2

తేదిః 18-01-2022

కోవిడ్ వ్యాక్సినేషన్ లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
కోవిడ్ వ్యాక్సినేషన్ లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, జనవరి, 18: జిల్లాలో రెండవ డోస్ మరియు 9 నెలలు పూర్తయిన ప్రంట్ లైన్ వర్కర్ లకు బూస్టర్ డోసులు అందించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం మండల ప్రత్యేక అధికారులు, జిల్లా వైద్యాధికారి, ప్రోగ్రాం ఆఫీసర్లు మరియు ఇతర వైద్యాధికారులతో (రొండువ, బూస్టర్,15నుండి17 సం.ల పిల్లల) కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ వెబ్ వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 100% మొదటి డోసు వ్యాక్సినేషన్ , 74% రెండవ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసామని అధికారులు వివరించారు. జనవరి 26 లోపు గడువు ముగిసిన సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 15 నుంచి 17 సంవత్సరాల పిల్లల వ్యాక్సినేషన్ ప్రభుత్వం ప్రారంబించిన నేపథ్యంలో జిల్లాలో 44% మేర వ్యాక్సినేషన్ మొదటి డోస్ పూర్తి చేసారని,మిగిలిన వారికి సైతం వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో కరోనా టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచాలని, దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని , కరోనా పరీక్షల ఫలితాల ఆధారంగా కోవిడ్ వ్యాపిస్తున్న వారిని గుర్తించి వారిని హోం క్వారంటైన్ చేయాలని సూచించారు. కరొనా అధికంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి సదరు ప్రాంతాలో ప్రత్యేక ప్రణాళికతో పారిశద్ద్య చర్యలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, పట్టణాలో పారిశుద్ద్య చర్యలు పకడ్భందిగా నిర్వహించాలని ఆదేశించారు.

కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఎలాంటి సామూహిక కార్యక్రమాలు, సభలకు అనుమతి అందించవద్దని , ప్రజలంతా తప్పనిసరిగ్గా మాస్కులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కరోనా వైద్యానికి చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, కేసులు అధికంగా వస్తే ఆసుపత్రి స్థాయిలో చికిత్స అందించేందుకు వీలుగా ఆసుపత్రులను సిద్దం చేయాలని, కొవిడ్ కోసం ప్రత్యేకంగా బెడ్లు, వార్డులు సిద్దం చేసుకోవాలని ఆదేశించారు.కరోనా కేసులు అధికంగా వస్తున్న ప్రాంతాలో టెస్టులు పెంచాలని, ట్రెసింగ్ పకడ్భందిగా నిర్వహించాలని ఆదేశించారు.

జిల్లా వైద్యారొగ్య శాఖ అధికారి , మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత. ప్రోగ్రాం అధికారులు తదితరులు ఈ జూమ్ కాన్పరెన్సులో పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, జగిత్యాల చే జారీచేయబడినది.

Share This Post