కోవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయుటకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి-రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు

రంగారెడ్డి జిల్లా  సెప్టెంబర్  15:: రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి స్పెషల్ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి అందరి సహకారంతో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయుటకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు సంబంధిత అధికారులకు సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టర్లు, జెడ్పి చైర్మెన్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓ లు, మున్సిపల్ కమిషనర్ లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. సబ్ సెంటర్ వారీగా గ్రామాలను గుర్తించి వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని , మున్సిపల్ పరిధిలో వార్డుల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి వంద శాతం వ్యాక్సినేషన్ చేయించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో ఆరోగ్య, ఆశ, అంగన్వాడి కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న స్పెషల్ వ్యాక్సినెషన్ డ్రైవ్ అందరి సహకారంతో వంద శాతం పూర్తి చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు.రోజుకు మూడు లక్షల మందికి టీకా వేయడం లక్ష్యంగా ఉందన్నారు. హ్యాబిటేషన్ వారీగా, పట్టణ ప్రాంతాల్లో వార్డు వారిగా వ్యాక్సినేషన్ పూర్తిచేసి డిక్లరేషన్ చేయాలన్నారు. డిఎంఅండ్హెచ్ఓ లు పూర్తిస్థాయిలో ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ పూర్తయిన ఇళ్లకు స్టిక్కర్లు వేయాలని సూచించారు. ఒక ఉద్యమంలా వ్యాక్సినేషన్ జరగాలన్నారు. అందరిని భాగస్వాములను చేయాలని సూచించారు.
రాష్ట్రంలో రెండు కోట్ల కు పైగా ప్రజలకు వాక్సినేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. వ్యాక్సినేషన్ చాలా చక్కగా పూర్తి చేశారని, ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని ఆయన అన్నారు. రాష్ట్రం లో కోవిడ్ ను అరికట్టడం లోనూ వైద్య ఆరోగ్య శాఖ , ఆయా శాఖలు అప్రమత్తంగా పని చేశాయన్నారు.
జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రేపటి నుండి ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు, జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 27 లక్షల 24 వేల 473 మంది జనాభా అర్హులు కాగా, ఇప్పటివరకు 19 లక్షల 9 వేల 462 మందికి వాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని ప్రధాన కార్యదర్శి కి తెలిపారు.
అనంతరం రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి అయిన సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులతో కలిసి కేక్ కట్ చేసారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ట్రైనీ కలెక్టర్ కదిరవన్ ఫలాని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, డి ఆర్ డి ఎ పి డి ప్రభాకర్ , జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జెడ్ పి సి.ఈ.ఓ దిలీప్ కుమార్, తదితరులు పాల్గోన్నారు

Share This Post