కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ

గురువారం జీ.హెచ్.ఎం.సి పరిధిలోని ఎల్బీ నగర్ సర్కిల్, లింగోజి గూడ డివిజన్, సరూర్ నగర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ద్వారా జానకి ఎన్ క్లేవ్ లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరికి వంద శాతం వ్యాక్సినేషన్ అందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కల్పించిన వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను జిల్లాలోని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. అనంతరం జీ.హెచ్.ఎం.సి పరిధిలో జానకి ఎన్ క్లేవ్ లోని వంద శాతం వ్యాక్సిన్ పూర్తి అయిన గృహాలకు వేసిన వ్యాక్సినేషన్ స్టిక్కరును పరిశీలించారు. వ్యాక్సిన్ వేయించుకొని వారిని గుర్తించి వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో కలెక్టర్ తో పాటు సరూర్ నగర్ డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వినోద్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post