కోవిడ్ వ్యాక్సిన్ మండలంలో 1000, మున్సిపాలిటిలలో 2000 ప్రతిరోజు జరగాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం.1 తేదిః 16-11-2021

కోవిడ్ వ్యాక్సిన్ మండలంలో 1000, మున్సిపాలిటిలలో 2000 ప్రతిరోజు జరగాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, నవంబర్ 16: జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రతిరోజు మండలంలో వేయి, మున్సిపాలిటిలో 2 వేలు జరగాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉధయం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్, పోడు భూముల వివరాల సేకరణ మరియు ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై అధికారులతో జూమ్ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, దీపావళి పండుగ తరువాత వ్యాక్సినేషన్ ప్రక్రియ వెనకబడి పోయిందని, మండలంలో 500, మున్సిపాలిటిలో 1000 మించి జరగడంలేదని అన్నారు. వ్యాక్సిన్ జిల్లాలో నూరుశాతం పూర్తయ్యే వరకు మల్టి డిసిప్లినరి టీంలు ప్రతిరోజు నిర్విరామంగా కృషి చేయాలని సూచించారు.

వ్యాక్సినేషన్ సాఫిగా జరగడానికి అన్ని విధాల సిబ్బందికి సహయ సహకారాలను అందించడం జరుగుతుందని, పోలింగ్ కేంద్రం వారిగా డోర్ టు డోర్ సర్వే చేసినప్పుడు వ్యాక్సినేషన్ పూర్తయినట్లుగా మెబైల్ ఫోన్ సంక్షిప్త సందేశాలు మొదలైన ఖచ్చితమైన ఆధారాల ద్వారా మాత్రమే దృవీకరించుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవడంపై ఉన్న అనుమానాలను, బయాలపై అవగాహకల్పించి వారికి వ్యాక్సిన్ అందించాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉపాధినిమిత్తం వచ్చే మైగ్రెటెడ్ లేబర్ లను గుర్తించి వారికి కూడా వ్యాక్సినేషన్ చేయాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండి ఓటరు లిస్టులో నమోదు కాని వారిని

కోవిడ్ వ్యాక్సిన్ మండలంలో 1000, మున్సిపాలిటిలలో 2000 ప్రతిరోజు జరగాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

గుర్తించి వారికి వ్యాక్సిన్ అందించాలని, కళాశాలలో వ్యాక్సినేషన్ క్యాంపులను నిర్వహించి 18 సంవత్సరాలు పైబడిన వారందరికి వ్యాక్సిన్ అందించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 150000 మంది ఇంకా వ్యాక్సిన్ పొందవవలసినవారు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు.

వ్యాక్సినేషన్ ను వేగవంతంగా పూర్తి చేసే క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్య సిబ్బందితో ప్రతిరోజు జిల్లా వైద్యాధికారి సమీక్షించాలని ఆదేశించారు. విధులలో నిర్లక్ష్యం వహంచే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గ్యాప్ లను గుర్తించి గ్రామం, హబిటేషన్ వారిగా వ్యాక్సినేషన్ వివరాలను సరిచూసుకొని నివేధికను పంపించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మారుమూల జిల్లాలు వ్యాక్సినేషన్ ప్రగతిలో చాలా ముందున్నాయని, ప్రజల్లో వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించాలని, జిల్లాను ముందంజలో నిలపాలని ఆదేశించారు.

ప్రతిరోజు ప్రతి కేంద్రం వారిగా నివేధికలను పరిశీలించడం జరుగుతుందని, ప్రగతిలో వెనకబడిపోయిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కోన్నారు. IKP, SHG, పచాయితి సెక్రటరీలు వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని, మొదటి విడత వ్యాక్సిన్ పూర్తయిన వారు ఎంతమంది ఉన్నారు. రెండవ విడత వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారు ఎంతమంది ఉన్నారు గుర్తించి వారికి వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ జరగనట్లయితే వారి తీసుకున్న ఫోటోలను సైతం పరిగణలోకి తీసుకోవాలని, రోజు వారి ప్రగతిని ప్రత్యేక అధికారులు సమీక్షించాలని అన్నారు. ఉధయం 09 గంటలకు వ్యాక్సినేషన్ బృందం అందరు హజరుకావాలని ఆదేశించారు.

అటవి భూ ఆక్రమణల వివరాలు సేకరించి నివేధికలను అందించాలని, మండలం వారిగా రికార్డులను పరిశీలించాలని, క్యాస్ట్ సర్టిఫికేట్లు పంపిణి చేయవలసినవి ఉన్నట్లయితే తహసీల్దార్లకు తెలియజేయాలని, పోడు భూముల వ్యవహరంలో వచ్చిన అప్లికేషన్ ఫాం లను, అటవి, తహసీల్దారు కార్యాలయాలలోని రిజిష్టర్ల వారిగా సమీక్షించాలని, తహసీల్దార్లు, యంపిడిఓ, అటవి అధికారుల ద్వారా రికార్డులను సమీక్షించి రేపటి లోగా నివేధికను అంధించాలని, ప్రజలు ఎక్కువగా వచ్చే రేషన్ షాపులు, పోడు భూముల సమావేశాలు జరిగే ప్రాంతాలలో ప్రజలకు వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎందుకు వేగంగా సాగడం లేదో అధికారులు సమీక్షించుకోవాలని సూచించారు.

దాన్యం సేకరణలో ఎక్కడ ఇబ్బందులు కలగరాదని, సమస్యలు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది

Share This Post