కోవిడ్ – 19 మహమ్మారి కారణంగా తల్లి తండ్రులను కోల్పోయిన పిల్లలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అనాధలైన ఆయా పిల్లలకు ప్రధాన మంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ లతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్….

కోవిడ్ – 19 మహమ్మారి కారణంగా తల్లి తండ్రులను కోల్పోయిన పిల్లలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అనాధలైన ఆయా పిల్లలకు ప్రధాన మంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ లతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సోమవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిఖిల కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలు నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా తల్లి తండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలకు ప్రధాన మంత్రి సహాయ నిధి ద్వారా హెల్త్ కార్డులు, స్కాలర్ షిప్పులు, పాస్ బుక్కులను కలెక్టర్ పిల్లలకు అందజేశారు. బాధిత పిల్లలకు 18 ఏండ్లు నిండే వరకు వారి పేరున రూ.10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు. 18 నుండి 23 ఏండ్లు మధ్యలో ఆ డిపాజిట్ పై వచ్చే వడ్డీని వారికి ఆర్థిక సహాయంగా అందించడం జరుగుతుందన్నారు. 23 ఏండ్లు పూర్తిగా నిండిన తర్వాత మొత్తం రూ. 10 లక్షలు పూర్తిగా బాధితులకు అందించడం జరుగుతుందని తెలియజేసినారు.
ఈ సందర్బంగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా మన వికారాబాద్ జిల్లాలో అనాధలైన 15 మంది పిల్లలకు జిల్లా కలెక్టర్ నిఖిల చేతుల మీదుగా హెల్త్ కార్డ్స్, స్కాలర్ షిప్, పాస్ బుక్ లను అందజేయడం జరిగింది. పిల్లలు అందరికి రెసిడెన్సీయల్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి మంచి విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఆర్థిక సహాయం మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగ పడుతుందని, అదేవిధంగా మీరు చదివే పైచదువులకు ఈ స్కీమ్ మిమ్మల్ని కాపాడుతుందని తెలియజేయడం జరిగింది. మీరు 23 సంవత్సరాలు వచ్చేసరికి ఈ పది లక్షల రూపాయలు ప్రీమియం మొత్తం మీకు అందుతుందని కావున మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పై చదువులు కొనసాగించాలని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లారెవిన్యూ డివిజన్ అధికారి విజయ లక్ష్మి, మహిళా శిశ సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ వెంకటేష్, ఆర్ బి కోఆర్డినేటర్ శ్రీ లక్ష్మి, డి సి పి యు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post