కోవిడ్-19 వలన తల్లిదండ్రులు మరణించి అనాధలైన 18 సంవత్సరాల లోపు  బాల బాలికలు ఆయా మండల  ఐసిడిఎస్ సూపరువైజర్ ను కానీ  అంగన్ వాడీ టీచర్లను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

కోవిడ్-19 వలన మరణించి అనాధలైన 18 సంవత్సరాల లోపు  బాల బాలికలు ఆయా మండల  ఐసిడిఎస్ సూపరువైజర్ ను కానీ  అంగన్ వాడీ టీచర్లను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. తల్లితండ్రుల మృతితో అనాధలైన బాలబాలికలకు ప్రభుత్వo ఆర్ధిక సహాయం కల్పించడం జరుగుతుందని చెప్పారు. కోవిడ్ తో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు  మరణ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మరియు ప్రస్తుతం పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న సంరక్షకులు మరియు ఆధార్ కార్డులను సంబంధిత ఐ.సి.డి.ఎస్. సూపరువైజర్,  అంగన్ వాడీ టీచర్లకు నవంబర్ 10వ లోగా దరఖాస్తు చేసుకోవాలని,  ఏమైనా సందేహాలు, సలహాలుంటే   ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరని కలెక్టర్ చెప్పారు.  జిల్లా బాలల సంరక్షణా విభాగము – 99894 90353; 99499 28123: 99891 00608 & 95056 82339.

Share This Post