క్యాన్సర్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి:- అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్

క్యాన్సర్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి:- అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్

ప్రపంచ తోబాకు నివారణ దినోత్సవం సందర్బంగా బుధవారం ఉదయం స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆరోగ్య శాఖ అద్వర్యం లో నిర్వహించిన ర్యాలీ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్ తోబాకు తినడం వలన క్యాన్సర్ బారిన పడటం ఖాయమాన్ని క్యాన్సర్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.   దేశంలో కాన్సర్ రావడానికి తోబాకు నే  కారణం. తోబాకు అన్ని రకాలుగా ప్రమాదకరం. క్యాన్సర్ పై ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు  అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. క్యాన్సర్ అనేక రకలలో ఉందన్నారు. అనంతరం జండా ఊపి ర్యాలి ని పారంభించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాం మనోహర్ రావు, డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, భిక్షపతి, ఆశ వర్కర్లు తదితరులుపాల్గొన్నారు

Share This Post