క్యాన్సర్ వ్యాధిపై అన్ని వర్గాల్లో అవగాహన కల్పించేందుకు తరచుగా శిబిరాలను నిర్వహించాలి రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

క్యాన్సర్ వ్యాధిపై అన్ని వర్గాల్లో అవగాహన  కల్పించేందుకు తరచుగా శిబిరాలను  నిర్వహించాలి

రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

0000000

       

      క్యాన్సర్ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తరచుగా శిబిరాలను నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

     శనివారం కరీంనగర్ పట్టణంలోని ట్రినీటీ బాలికల జూనియర్ కళాశాలలో హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన క్యాన్సర్ స్క్రీనింగ్  క్యాంపు ను మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి   మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తరచుగా శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపునకు విశేష స్పందన వచ్చిందన్నారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న నిరంతర సేవలను అభినందించారు. అలాగే సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ నివారణ చర్యల గురించి  అవగాహనన పెంచేందుకు కృషి చేస్తోందని వివరించారు.వ్యాధుల సోకడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించినప్పుడు అవి సోకకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని,  వ్యాధి ప్రబలిన తరువాత ఆందోళన చెందడం కంటే ముందు జాగ్రత్తలు తీసుకుని దాని బారిన పడకుండా ఉండేందుకే చొరవ చూపాల్సిన అవసరం ఉందని అన్నారు.

      ఏవోఐ ప్రాంతీయ సీఓఓ డాక్టర్ ప్రభాకర్ పాలచర్ల మాట్లాడుతూ శిబిరంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు  మొదట్లోనే వ్యాధి లక్షణాలను గుర్తించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుక ప్రయత్నించామన్నారు.  తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తించి   నివారణ చర్యలు తీసుకోవడమే అత్యంత  కీలకమన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ రెగ్యులర్ స్క్రీనింగ్‌ను చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.  తెలంగాణ రాష్ట్రంలోని రోగులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేందుకు క్లినికల్ నైపుణ్యంపై ఆధునిక సాంకేతికతతో సేవలందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అమెరికన్ అంకాలజీ ఇనిస్ట్యూట్ అనేది  క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు సేవలందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ అని వివరించారు. ఉచిత అల్ట్రాసౌండ్, పాప్ స్మెర్ పరీక్షలు మరియు ఇతర ల్యాబ్ పరీక్షలను కేవలం లక్షణాలు ఉన్న రోగులకు మాత్రమే చేస్తామన్నారు.

     ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్,  అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, నగర మేయర్ వై.సునీల్ రావు, జిల్లా వైద్య అధికారి డాక్టర్ జువేరియా, కార్పోరేటర్ మేచినేని వనజ-అశోక్ రావులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post