క్రికెట్ పోటీల్లో పాల్గొన్న ఉద్యోగులు….

క్రికెట్ పోటీల్లో పాల్గొన్న ఉద్యోగులు….

ప్రచురణార్థం

క్రికెట్ పోటీల్లో పాల్గొన్న ఉద్యోగులు….

మహబూబాబాద్, ఏప్రిల్ – 23:

జిల్లా ఉద్యోగులు శనివారం క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు. స్థానిక ఎన్.టి.ఆర్.స్టేడియం లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 వరకు క్రికెట్ పోటీలు నిర్వహించగా, క్రికెట్ మ్యాచ్ లో మానేరు Vs ప్రాణహిత పోటీపడగా మొదటగా ప్రాణహిత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్కు దిగిన మానేరు జట్టు 104 పరుగులు చేసి105 పరుగు లక్ష్యాన్ని ప్రాణహిత ముందు ఉంచగా 67 పరుగులకే కుప్పకూలి ఆలౌటైంది.

ఉదయం గోదావరి Vs శబరి జట్లు పోటీపడగా టాస్ గెలిచిన శబరి జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 82 పరుగుల లక్ష్యాన్ని గోదావరి ముందు ఉంచగా ఒక వికెట్ నష్టానికి 5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.

మధ్యాహ్నం నుంచి జరిగిన మ్యాచ్లో మున్నేరు Vs కిన్నెరసానిలు పోటీపడగా మున్నేరు జట్టు టాస్ గెలిచి బ్యాట్ ఎంచుకోని 86 పరుగులు చెయ్యగా, కిన్నెరసాని జట్టు 32 పరుగులకే ఆలౌట్ అయింది.

పాకాల్ , కడెం జట్లు బరిలోకి దిగగా పాకాల జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని 85 పరుగుల లక్ష్యాన్ని కడెం జట్టు ముందు లక్ష్యాన్ని ఉంచగా 56 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ రోజు, 23న, 24 న గెలుపొందిన టీములు 25 న ఉదయం సెమీ ఫైనల్, అదే రోజు సాయంత్రం ఫైనల్ లో తలపడతాయి.

ఈ క్రికెట్ పోటీలలో జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ తో పాటు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు అభిలాష అభినవ్ స్టేడియంలో పోటీలను తిలకించి, పోటీల్లో పాల్గొన్న ఉద్యోగులను కలిసి అభినందించారు.

———————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.Share This Post