క్రిష్టమస్ గిఫ్ట్ ప్యాక్ పంపిణి – శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి

క్రిష్టమస్ గిఫ్ట్ ప్యాక్ పంపిణి – శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి

ప్రతి బీదవాడు పండుగను సంతోషగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రిష్టమస్ గిఫ్ట్ ప్యాక్ లు అందజేస్తున్నదని, కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్టమస్ పండుగను కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని మెదక్ శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక వైస్రాయ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన క్రిష్టమస్ గిఫ్ట్ ప్యాక్ పంపిణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, మెదక్ నియోజక వర్గ క్రిస్టియన్ సెలెబ్రేషన్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు రెవరెండ్ సంజీవరావు, ఉపాధ్యక్షులు కరుణాకర్, జనరల్ సెక్రెటరీ వినయ్, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిష్టమస్ కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి వేడుకలు ప్రాంరంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ మాట్లాడుతూ ప్రపంచమంతా శాంతియుతంగా , ప్రేమ పూర్వకంగా ఉండాలని, ప్రేమను అందరికి పంచాలని, త్యాగం, ప్రేమ గొప్పతనాన్ని, మనకు తెలిపిన ఆ యేసు ప్రభువు బోధనలను ప్రతి ఒక్కరు పాటించాలని హితవు పలికారు.
గత సంవత్సరం పండుగను బాగా జరుపు కోవాలనుకున్నా కరోనా వల్ల జరుపుకోలేకపోయామని, ఇప్పుడైనా బాగా జరుపుకోవాలనుకుంటే కొత్త వేరియంట్ ఓమిక్రాన్ రూపంలో కరోనా కేసులు నమోదవుచున్నందున ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకుంటూ భౌతికదూరం పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. క్రిస్టమస్ పండుగ రోజున ఎక్కడెక్కడి నుంచో చర్చికి వస్తారని, అందరు యేసు ప్రభువు దీవెనలు, దయతో పండుగను బాగా జరుపుకోవాలంటే కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు పండుగను సంతోషంగా జరుపుకోవాలని నిరుపేదలకు క్రిష్టమస్ గిఫ్ట్ ప్యాక్ లు, బట్టలు పంపిణి చేస్తున్నదని అన్నారు. ఒక్కో నియోజక వర్గానికి వేయు చొప్పున జిల్లాలో రెండు వేల గిఫ్ట్ ప్యాక్ ల పంపిణీతో పాటు విందు భోజనం ఏర్పాటు చేశామని అన్నారు. అందరు కలిసి చేసుకునే పండుగలను ప్రతి పేదవాడు కూడా సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు సంబంధించి బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు, రంజాన్ సందర్భంగా ముస్లిం లకు బట్టల పంపిణి, క్రిస్టమస్ సందర్భంగా పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్ ల పంపిణి వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనస్సులు చూరగొన్నదని అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ కరోనా నిబంధనల మేరకు అందరు పండుగను ఆనందంగా జరుపుకోవాలని, క్రిస్టమస్ శుభాక్షాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి జగదీష్, ఆర్.డి.ఓ. సాయి రామ్, మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు , పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post