క్రిస్మస్ పండుగకు గిఫ్ట్ ప్యాకులు పంపిణీ :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణార్దం-2
జనగామ, డిసెంబర్ 13: క్రిస్మస్ పండుగకు గిఫ్ట్ ప్యాకులు పంపిణీకి సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారo కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ, క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ద్వారా నియోజకవర్గానికి వేయి మంది పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకులు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో పేద క్రైస్తవులను గుర్తించి వారికి గిఫ్ట్ ప్యాకులతో పాటు, క్రిస్మస్ విందు భోజనాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ నెల 15 నుండి 17 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సెలబ్రేషన్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్వర్యంలో ఈ వేడుకలు జరిపాలని, ఇందుకుగాను రెవెన్యు డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో కృష్ణవేణి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఇస్మాయిల్, డీఆర్డీఓ రాంరెడ్డి, తహసిల్దార్లు, క్రైస్తవ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post