క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధి హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు.

క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధి హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం నాడు కలెక్టరేట్ సమా వేశ మందిరంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా వరంగల్ పశ్చిమ & పర్కల్ నియోజకవర్గ అధికారులు క్రిస్మస్ వేడుకల నిర్వహణ కమిటీతొ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని వరంగల్ పశ్చిమ & పర్కల్ రెండు నియోజకవర్గాలకు 2000 గిఫ్ట్ ప్యాకులు, నాలుగు లక్షలు ఫీస్ట్ తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వరంగల్ పశ్చిమ, పర్కల నియోజకవర్గంలో ని ఒకటి లేదా రెండు అనువైన స్థలాల్లో ఆర్గనైజేషన్ కమిటీ, అధికారులు సమన్వయంతో గిఫ్ట్ ప్యాకులు పంపిణీ చేయాలని కలెక్టర్ అన్నారు.
క్రిస్మస్ వేడుకలలో ఏలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయనఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటించుటకు కమిటీ సభ్యులు చర్చిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు.

ఈ సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మేన శీను, పాస్టర్ నందకుమార్, డీ.ఐజక్, ఇమ్మానియేల్ తాసిల్దార్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post