క్రిస్మస్ వేడుకల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలి : జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

ప్రచురణార్థం
ములుగు
డిసెంబర్ 23 (గురువారం):
*క్రిస్మస్ వేడుకల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలి : జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*
క్రిస్టమస్ పండగ జరుపుకుంటున్న క్రిస్టియన్ పేద ప్రజల గురించి తెలంగాణ ప్రభుత్వం తరఫున బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం మహత్తర కార్యక్రమంగా భావించాలని, క్రైస్తవ సోదరీ సోదరీమణుల కుటుంబ సభ్యులు క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.
గురు వారం రోజున లీలా గార్డెన్ లో ఏర్పాటు చేసిన క్రిస్టమస్ పండగ సందర్భంగా బట్టల పంపిణి కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొని 25న జరుపుకొను క్రిస్మస్ పండగ సందర్భంగా 20 మంది క్రిస్టియన్లకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బట్టల పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వారి చిన్నప్పుడు స్కూళ్ళలో జరిగే క్రిస్మస్ వేడుకలను గుర్తు చేశారు. క్రిస్మస్ కుటుంబాలలో అతి పెద్ద పండుగా అని, డిసెంబర్ నెల నుండి జనవరి 1 వరకు క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావిస్తూ వేడుకలను నిర్వహింస్తు ఉత్సాహంగా జరుపుకుంటారు అని అన్నారు. క్రిస్మస్ వేడుకల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని , ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి మరియు రెండో డోసులు ప్రతి ఒక్కరు వేసుకోవాలని పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా డిఆర్వో రమాదేవి మాట్లాడుతూ క్రీస్తు అంటే శాంతి, ప్రేమ ,శాంతియుత మార్గంలో ప్రజలను నడిపించే ఒక మార్గం అని అన్నారు.అలాగే అన్ని మతాల సారాంశం కలిగిన భారత దేశంలో అన్ని మతాలను గౌరవించుకుంటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను అధికారికంగా ఏర్పాటు చేయడమైనదని వారు అన్నారు.
జిల్లా కమిటీ అధ్యక్షులు సుదర్శన్ పాస్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గ్రౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాo అని ఈ ప్రభుత్వం, అధికార యంత్రాంగం పదికాలాలు అభివృద్ది పథంలో ముందుకు వెళ్లాలని ప్రార్థనలు చేశారు.
ఈ వేడుకలో ఎంపీపీ శ్రీదేవి, డిఆర్వో రమాదేవి , dwo ప్రేమలత, ములుగు తాసిల్దార్ సత్య నారాయణ స్వామి , మైనారిటీ వెల్ఫేర్ శాఖ రేణుక , జనార్ధన్ పాస్టర్,రాజేశ్వరి ,చందన, చార్లెస్ రాజ్ ,తదితర ఫాస్టర్లు ,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Post