క్రీడలకు అనువుగా ఉండే స్థలాలను గుర్తించండి జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్

క్రీడలకు అనువుగా ఉండే స్థలాలను గుర్తించండి

జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్
0 0 0 0

గ్రామీణ కేంద్ర క్రీడాప్రాంగణాల కొరకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల నుండి క్రీడలకు ప్రాదాన్యం కల్పించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరం స్థలంలో ఆటస్థలం ఏర్పాటుకు ఆదేశించిన తరుణంలో బుదవారం కొత్తపల్లి మండలం లోని చింతకుంట, ఎలగందల్ గ్రామాలలో గ్రామీణ క్రీడా ప్రాంగణల కొరకు చింతకుంట ఎస్సారెస్పి కెనాల్ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఖోఖో, కబడ్డి మొదలగు ఆటలకు అనుకూలంగా ఉండేలా క్రీడా ప్రాంగణాలను సిద్దం చేయాలని సూచించారు. స్థలం సేకరణలో సమస్యలు తలెత్తకుండా ముందుగానే చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎల్గందల్ గ్రామంలోని బృహాత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ప్రకృతి వనంలో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయాలని మొక్కలకు నీటిని సక్రమంగా అందజేయాలని పేర్కోన్నారు.

ఈ పర్యటనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్,చింతకుంట, ఎల్గందల్ సర్పంచులు ఎ. షర్మిల తదితరులు పాల్గోన్నారు.

Share This Post