క్రీడలకు పునర్వైభవం తెచ్చేందుకే క్రీడా ప్రాంగణాలు : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రచురణార్ధం

జూన్,02 ఖమ్మం –

క్రీడలకు పునర్వైభవం తెచ్చేందుకు క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం మంత్రి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిర్మాణాలు పూర్తయిన క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. మంత్రి ఖమ్మం కార్పోరేషన్ 53వ డివిజన్లోని ఎన్ఎస్సీ, క్యాంపు, 6వ డివిజన్ లోని రస్తోజ్ నగర్, 40వ డివిజన్లోని సుందరయ్య నగర్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలను, పట్టణ ప్రకృతి వనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడాకారులకు, యువతకి ప్రోత్సాహకంగా ఉండేందుకు క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వాలీబాల్, షటిల్, బాస్కెట్ బాల్, ఓపెన్ జిమ్, టాయిలెట్స్, త్రాగునీరు, చిన్నారులకు ఆట వస్తువులు, గ్రీనరీ తదితర వసతులతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి గ్రామం, వార్డులో ఒకటి, పట్టణాల్లో ప్రతి డివిజన్ కి 3 తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు ఆయన అన్నారు. జిల్లాలో 753 తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు కార్యాచరణ చేసినట్లు, 272 చోట్ల స్థల సేకరణ పూర్తయినట్లు, 52 చోట్ల పనులు గ్రౌండింగ్ చేయగా, 40 చోట్ల పనులు పూర్తయి, గురువారం ప్రారంభించుకున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్ఎస్సీ క్యాంపులో రెండున్నర ఎకరాల స్థలం, సుందరయ్య నగర్లో అర ఎకరం, రస్తోజి నగర్లో వెయ్యి గజలల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు.

మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ తన పర్యటనలో భాగంగా పట్టణ ప్రకృతి వనంలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్. వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post