క్రీడలకు పునర్వైభవం తెచ్చేందుకే క్రీడా ప్రాంగణాలు

క్రీడలకు పునర్వైభవం   తెచ్చేందుకే క్రీడా ప్రాంగణాలు

క్రీడా ప్రాంగణం చుట్టు మొక్కలు నాటాలి.

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 700 నగరంలో 160 నుండి 180 క్రీడా ప్రాంగణాలను గుర్తించాం

రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 6892 దాన్యంకోనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది.

రాష్ట్ర బీసి సంక్షేమం మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

0 0 0 0

               కనుమరుగవుతున్న గ్రామీణ క్రీడలు, ఆటలకు పునర్వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం  క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర బీసి సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

            గురువారం తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకావిస్కరణ చేసి జిల్లా ప్రగతి గురించి ప్రసంగించారు.  అనంతరం  తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించి, ఉత్తమ సేవలు ప్రధానం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పద్మనగర్  16వ డివిజన్ లో  4 లక్షల రూపాయల  వ్యయంతో, హౌజింగ్ బోర్డు కాలనీ 7వ డివిజన్ లో రూ.5.30 లక్షల వ్యయంతో నిర్మించిన క్రీడా ప్రాంగణాలను ప్రారంబించారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలకు పునర్ వైభవం తెచ్చేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు  క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి  రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు. యువత సెల్ ఫోన్ లకు అంకితమై పోవడంతో ఆరోగ్య సమస్యలు ఏర్పాడు తున్నాయని అన్నారు.  గ్రామీణ ప్రాంతాలలో ఖాళీ ప్రదేశాలలో కబడ్డి, ఖోఖో, గిల్లిదండ వంటి ఆటలు ఆడుకుంటు శారీరకంగా దృఢంగా ఉండేవారని,  క్రమేణ  భూములన్ని అన్యాక్రాంతం ఆవడంతో, గ్రామీణ ప్రాంతాలలో క్రీడాప్రాంగణాలకు సరైన స్థలాలు లేకుండా పోయాయని ఆటువంటి పరిస్థితులకు స్వస్తి చెప్పి అంతరించిపోతున్న క్రీడలకు పునర్ వైభవం తెచ్చేందుకు  క్రీడలకు ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం  రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కోన్నారు.   కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 700, నగరంలో 160 నుండి 180 క్రీడా ప్రాంగణాలను గుర్తించడం జరిగిందని తెలిపారు.  వాటిని  పరిశుభ్రం చేసి ఆటలకు ఆందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. అన్ని రంగాలలో ముందున్న తెలంగాణను క్రీడలలో కూడా ముందుంచేలా క్రీడా ప్రాంగణాలకు ఏర్పాటు చేయడం జరుగుంతుందని పేర్కోన్నారు.  రోజులో రెండు గంటల పాటు పిల్లలు, యువకులు క్రీడా ప్రాంగణాలకు వచ్చి ఆటలు ఆడుకోవాలని కోరారు.  అంతకుముందు  పద్మనగర్ లొని క్రీడా మైదానంలో వాలిబాల్ ఆటను ఆడారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ క్రీడా ప్రాంగణంలో క్రీడా క్రీడా ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు.

 

చివరి  గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం – రైతులు ఆందోళన చెందవద్దు

000000

     రైతులు పండించిన  చివరి ధాన్యపు గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని   రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

     గురువారం పద్మ నగర్ లో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన అనంతరం  పాత్రికేయులతో మంత్రి  మాట్లాడుతూ యాసంగి లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎవరు కూడా అధైర్య పడవద్దని అన్నారు. రైతులు పండించిన చివరి గింజ ను జూన్ 10 వరకు  కొనుగోలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక  ముందు  6 నుండి 7 గ్రామాలకు ఒక కోనుగోలు కేంద్రం  ఉండేదని పంటలు అమ్ముకోవాలి అంటే ఇబ్బందులు పడేవారని   కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రతి  గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని,5వేల ఎకరాలకు పైబడిన గ్రామాలలో 2 నుండి 3 కోనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని అన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 6892 కోనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోని యాసంగిలో 41లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని పేర్కోన్నారు. ధాన్యం  కొనుగోలు పూర్తిచేసుకున్న 2వేల కోనుగోలు కేంద్రాలను  మూసివేయడ౦ జరిగిందని, ఫుడ్ కార్పోరేషన్ వారు బియ్యం తీసుకోకపోవడంతో కొన్నిచోట్ల బియ్యం నిల్వలు ఉండిపోయాయని వాటితో స్థలం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఆలాంటి చోట గోడౌన్స్, మార్కేట్ యార్డ్స్ లలోని దాన్యం తీసుకోని రైతులకు ఖాతాలలో డబ్బులు జమచేయడం జరిగిందని పేర్కోన్నారు.   రైతులు అధైర్య పడవద్దని చివరి ధాన్యపు గింజ వరకు  ప్రభుత్వం కొనుగోలు చేస్తందని పేర్కోన్నారు.

     ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు,  జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్  మెప్మా పిడి రవీందర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగారాం, ఆయా  డివిజన్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post