క్రీడలు వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయి

ప్రచురణార్థం

క్రీడలు వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయి

కేసముద్రం సెప్టెంబర్ 26.

క్రీడలు దేహా దారుడ్యాన్ని కాక వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.

ఆదివారం మండలంలోని ఇనుగుర్తి గ్రామం జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో కందుకూరి కొమరయ్య స్మారక వాలిబాల్ క్రీడా ఉత్సవాల రాష్ట్రస్థాయి టోర్నమెంట్ను జిల్లా కలెక్టర్ క్రీడా పతాకాన్ని ఎగురవేసి ప్రారంభించారు 8 జిల్లాల నుండి పాల్గొన్న క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

అనంతరం వాలీబాల్ కోర్టులో బంతిని ఎగరవేసి క్రీడను ప్రారంభించారు.

అంతకు ముందు ఏర్పాటు చేసిన సభలో కందునూరి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు దేహదారుఢ్య నే కాక వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయని తద్వారా ఉన్నత స్థానంలో రాణించగలుగుతారని తెలిపారు.

వాలీబాల్ క్రీడ కు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామ కీర్తినీ ఇనుమడింపజేశారన్నారు.

అంతేగాక వాలీబాల్ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు విశేష కృషి సల్పడం మరువలేనిదన్నారు.

వాలీబాల్ క్రీడాకారుల గా ఉద్భవిస్తున్న గ్రామంగా ఇనుగుర్తి పతాకస్థాయికి చేరడం జిల్లాకు గర్వకారణమన్నారు.

క్రీడోత్సవాలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని కలుగజేసింది అని ఇది అత్యంత శుభ పరిణామ మన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి అనిల్ కుమార్ తాసిల్దార్ కోమలి అంతర్జాతీయ జాతీయ వాలీబాల్ క్రీడాకారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
—————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post