క్రీడలు శారీరక సామర్ధ్యం, నైపుణ్యలను పెంపొందించుకునేందుకు దోహదపడతాయి

 

క్రీడలు శారీరక సామర్ధ్యం, నైపుణ్యలను పెంపొందించుకునేందుకు దోహదపడతాయి

 

ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో పాల్గొనాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

0000000

     క్రీడలు మనిషి ఆరోగ్యంగా మానసికంగా ఎదగడానికి, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

    శనివారం పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జ్యోతిష్మతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు  చదువుతోపాటు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆటలో పాల్గొనాలని అన్నారు. ఆటలు, క్రీడలు మనిషి ఆరోగ్యంగా మరియు మానసికంగా ఎదగడానికి ఉపయోగపడతాయన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం ఒక సామాజిక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అన్నారు.  అనంతరం బ్యాడ్మింటన్ ఆడారు.

     ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కే రాజవీర్, జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జి సాగర్ రావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి వై ఉపేందర్ రావు, జ్యోతిష్మతి విద్యా సంస్థ ప్రిన్సిపాల్ కె ఎస్ రావు, పీడీ వెంకటేశ్వరరావు, బ్యాట్మెంటన్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post