క్రీడల్లో దేశానికి మంచి పేరు తీసుకురావాలి. హైదరాబాద్ కలెక్టర్ ఎల్. శర్మన్.

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మెడల్స్ అందజేస్తున్న కలెక్టర్ శర్మన్, హైదరాబాద్ డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ సుధాకర్ తదితరులు…
హైదరాబాద్: బాగా చదివి స్పోర్ట్స్ ఆడి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవడమే కాకుండా క్రీడాకారులుగా దేశానికి మంచి పేరు తీసుకురావాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ సూచించారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ 117వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మెడల్స్, క్యాష్ రివార్డ్, బహుమతులు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ హాజరై క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. అనంతరం కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ హాకీ క్రీడాకారులుగా మేజర్ ధ్యాన్ చంద్ భారత దేశానికి ఎంతో పేరు తెచ్చారని కొనియాడారు. నేటి క్రీడాకారులు అర్జున అవార్డు గ్రహీతలు కావాలని ఆకాంక్షించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను రోల్ మోడల్ గా తీసుకొని నేటి క్రీడాకారులు ముందుకు వెళితే విజయం మీ వైపు ఉంటుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల పైన దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. చిన్న పిల్లలు సైతం క్రీడల్లో రాణించి క్రీడల్లో తమ ప్రతిభను చూపి మెడల్స్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజయం సాధించిన చిన్న పిల్లలకు మెడల్స్ అందజేసి ఇంత చిన్న వయసులో క్రీడల పైన మక్కువ చూపడం ఎంతో సంతోషంగా ఉందంటూ పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత అన్ప్ కూమార్ వ్యామా, బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ శ్రీనివాస్, కోచ్ఛ్ల్ విజయ భాస్కర్ రెడ్డి, జైపాల్, నిర్మల్ సింగ్, మనోజ్ రెడ్డి,పూర్ణచందర్, కుమారస్వామి, దీపక్ ప్రసాద్, విశాల్, రాజేష్, శ్రీకాంత్, రామకృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post