క్రీడారంగానికి ప్రాధాన్యం – ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

క్రీడారంగానికి ప్రాధాన్యం – ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు దోహదపడుతాయని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

అందుకే పల్లెలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్ డిపో సమీపంలో గల సర్వేనెంబర్ 361 లో 7 ఎకరాల స్థలాన్ని  మినీ స్టేడియానికి కేటాయించిన స్థలాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

రూ.3.50 కోట్ల వ్యయంతో జిల్లా కేంద్రంలో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ….. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆట స్థలాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పల్లె, పట్టణ ప్రగతిలో జిల్లా వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా జిల్లా కేంద్రంలో మినీ స్టేడియానికి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ 7 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రొసీడింగ్ ఇచ్చారన్నారు.  జిల్లా కేంద్రంలో ఉండే మినీ స్టేడియం అదినాతనమైన హంగులతో  ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ పరంగా 3.50 కోట్లు మంజూరు అవుతాయని, అదనంగా తన ట్రస్ట్ ద్వారా నిధులు మరో 2 కోట్లు కేటాయిస్తానన్నారు.

పనులు వెంటనే ప్రారంభించి వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మున్సిపల్ చైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్, జిల్లా క్రీడల అధికారి హనుమంతు నాయక్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ప్రసాద్ గౌడ్ కార్యాలయ సిబ్బంది అమరేశ్వర్ ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

Share This Post