క్రీడా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సందర్శించి పరిశీలించారు.

సోమవారం 4వ విడుత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో క్రీడా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సందర్శించి పరిశీలించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 5వ విడుత పల్లె ప్రగతి / 4వ విడుత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా క్రీడలకు ప్రాదాన్యం కల్పించే దిశగా ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించడం జరిగింది. క్రీడా ప్రాంగాణాల ఏర్పాటు వలన పిల్లలకు, యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేటి యువతకు క్రీడా ప్రాంగాణాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. క్రీడాప్రాంగణంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను, హరిత హారం పనులను పరిశీలించారు.

ఈ పర్యటనలో మునిసిపల్ కమీషనర్ సాబేర్ అలీ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post