క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన:: జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య.

ప్రెస్ రిలీజ్.
తేది 02. 6 .2022
ములుగు జిల్లా.

క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన:: జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య.

౦౦౦౦౦

గ్రామీణ యువతను క్రీడా రంగాల్లో ప్రోత్సహించేలా ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు.

గురువారం జిల్లా కేంద్రం లోని పల్లె ప్రగతి వనం దగ్గర తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ యువతను క్రీడలలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని అన్నారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కబడ్డీ, ఖో ఖో, వాలీ బాల్, తదితర క్రీడల్లో యువత రాణించాలని అన్నారు. జిల్లాలో మండలానికి రెండు చొప్పున, 18 క్రీడా ప్రాంగణాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత యువత ఆటలలో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయి పథకాలు సాధించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నదని తెలిపారు.

అలాగే రేపటి ( జూన్ 3) నుండి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు. పల్లె ప్రగతిలో చేపట్టనున్న పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమన్వయం చేసుకొని కార్యక్రమాలను విజయవంతం చేయాలనీ సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వై.వి. గణేష్, జిల్లా పంచాయితీ అధికారి, వెంకయ్య, తహసిల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ ఇక్బాల్, జడ్పీటీసీ సకినాల భవాని, ఎంపిపి గండ్ర కోట శ్రీదేవి, ఎంపిటిసి గొర్రె సమ్మయ్య, సర్పంచ్ బండారి నిర్మల ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post