*క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

*క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

ప్రచురణార్థం

*క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.*

మహబూబాబాద్, జూన్ -02:

పట్టణంలోని కొత్త బజార్ వార్డు నెంబర్ 24, ఇంద్రానగర్ కాలనీలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనీ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు, యువత శారీరకంగా, మానసిక ఉల్లాసం తో దృఢంగా ఎదగడానికి ముఖ్యమంత్రి తెలంగాణ క్రీడా ప్రాంగణాల ను ఏర్పాటు చేయాలని సూచించారని, ప్రతి వార్డులో, గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ప్రతి గ్రామపంచాయతీలో, అర్బన్ ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామనీ, ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగనాలను సద్వినియోగం చేసుకుని యువత క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పి, అదనపు కలెక్టర్ లతో కలిసి వాలీ బాల్ ఆడారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ కె.శశాంక, ఎస్పి శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, స్థానిక వార్డ్ కౌన్సిలర్ మార్నెని వెంకన్న, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, జిల్లా స్పోర్ట్స్ అధికారి అనిల్, మునిసిపల్ డి. ఈ.ఈ. ఉపేందర్, ఎం. ఈ. ఓ బి.సురేష్, తదితరులు పాల్గొన్నారు.
తదితరులు పాల్గొన్నారు.

————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయము, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post