క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన       తేది:25.11.2022, వనపర్తి.
      “స్వచ్చ సర్వేక్షణ” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వివిధ కేటగిరిలో అవార్డులు రాగా, వనపర్తి జిల్లాలోని కొత్తకోట మునిసిపాలిటి కి 15-25 వేల జనాభా కేటగిరిలో 3వ. స్థానంలో అవార్డు సొంతం చేసుకుందని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ హర్షం వ్యక్తం చేశారు.
    శుక్రవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలపై మునిసిపల్ కమిషనర్ లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఉన్న ఆస్తి పన్ను, నీటి పన్ను, వాణిజ్య లైసెన్సులపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. డిసెంబర్ 15వ. తేదీలోగా అన్ని పన్నులు వసూలు చేయాలని ఆయన ఆదేశించారు. పన్నులు వసూలు చేసేందుకు బిల్ కలెక్టర్లను బృందాలుగా ఏర్పాటు చేసి, ప్రతి రోజూ పర్యవేక్షించాలని కమిషనర్ లకు ఆయన సూచించారు. బిల్ కలెక్టర్లు పని చేయని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 50 శాతం పన్నులు వసూలు చేసినట్లు, వసూలు కానీ పన్నులపై చర్యలు చేపట్టి 100 శాతం పన్నులు వసూలు చేయాలని ఆయన అన్నారు.
       తెలంగాణకు క్రీడా ప్రాంగణాల స్థలాలకు సంబంధించిన పూర్తి నివేదికల జాబితాను  సమర్పించాలని, పురోగతిలో ఉన్న క్రీడా ప్రాంగణాలు వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన నర్సరీల నివేదికలు వెంటనే అందించాలని, లక్ష్యాన్ని పూర్తిచేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా, స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.
    ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు వనపర్తి విక్రమ్ సింహా రెడ్డి, కొత్తకోట వెంకటేశ్వర్లు, పెబ్బైర్ జాన్ కృపాకర్, అమరచింత కమిషనర్ ఆత్మకూర్  కమిషనర్, బిల్ కలెక్టర్లు, పారిశుధ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
…..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post