క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రచురణార్థం…….2

తేదీ.31.12.2022

క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి
డిసెంబర్ 31

జిల్లాలోని ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే దిశగా అధికారులు అవసరమైన తగు చర్యలు చేపట్టాల

ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధించిన అధికారులను ఆదేశించారు.శనివారం తన ఛాంబర్ లో గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు , అవసరమైన స్థలాల ఎంపిక పై తహసిల్దార్ లతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.

భూపాల్ పల్లి జిల్లాలో మొత్తం 241 గ్రామాల్లో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 212 గ్రామాల్లో సంబంధిత స్థలాలను ఎంపిక చేసామని, మరో 20 చోట్ల ప్రక్రియ తుది దశకు చేరుకుందని, 9 చోట్ల స్థలాలు ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతంలో యువకులు, విద్యార్థులకు మానసిక శారీరిక ఎదుగుదల కోసం క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడతాయని, వీటి కోసం కనీసం 1 ఎకరం భూమి గుర్తించాలని కలెక్టర్ కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఇబ్బందులు ఎదురైతే , వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, దాని కోసం కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటులో ఇబ్బందులు ఎదురవుతున్న గ్రామాలలో ప్రత్యేక దృష్టి సారించి 15 రోజులో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని తహసిల్దారులు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది

Share This Post