*క్రొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు కార్డులు అంద చేయాలి:: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్*

*క్రొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు కార్డులు అంద చేయాలి:: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్*

*ప్రచురణార్థం-1*
రాజన్న సిరిసిల్ల, జనవరి 12: క్రొత్తగా ఓటరు జాబితాలో నమోదు చేసిన ఓటర్లకు ఓటరు (ఎపిక్) కార్డులు ఈ నెల 25 న జరుపుకొనే జాతీయ ఓటరు దినోత్సవం రోజున అంద చేయాలని చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ ఓటరు దినోత్సవం, నూతన ఓటరు జాబితా మున్నగు అంశాలపై బుధవారం జిల్లా ఎన్నికల అధికారులతో సిఇఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి 5 న తుది ఓటరు జాబితా రూపొందించామని, అందులో 18 సంవత్సరాల వయస్సు నిండి, నూతనంగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు జాతీయ ఓటరు దినోత్సవంన నూతన ఓటర్ ఎపిక్ కార్డు, కిట్లను అందజేయాలన్నారు. నూతనంగా నిర్మించి ప్రారంభించుకున్న ఈవిఎం గోదాంలలోకి ఈవిఎంలు (బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లు) లను వారం లోగా తరలించాలని ఆయన తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం ను కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహణ పై అధికారులకు సిఇఓ పలు సూచనలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1099 మందికి జాతీయ ఓటరు దినోత్సవ రోజున ఓటర్ ఎపిక్ కార్డులు అందించే దిశగా చర్యలు చేపడతామన్నారు.
ఇంచార్జ్ డీఆర్ఓ టి. శ్రీనివాస రావు, ఏపీడీ నర్సింహులు, ఎన్నికల విభాగం ఉప తహశీల్దార్ రెహమాన్, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Share This Post