క్షయవ్యాధి పట్ల జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా నయం చేయవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్ తెలిపారు.

క్షయవ్యాధి పట్ల జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా నయం చేయవచ్చని జిల్లా అదనపు కలెక్టర్  మయంక్ మిత్తల్ తెలిపారు.  శుక్రవారం  ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సాహం సందర్బంగా స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి జండా యూపీ ర్యాలీని రారంభించారు ఈ సందర్బంగా  ఆయన మాట్లాడారు. క్షయవ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.  వ్యాధి లక్షణాలు, దాని తీవ్రత తగ్గించేందుకు మందులు ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేసే శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 24 న నిర్వహిస్తారు.  భారత ప్రభుత్వం 1962ను క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకమైన చర్యలను తీసుకోవడం ప్రారంభించింది.

ఈ ర్యాలీ లో జిల్లా వైద్యాధికారి రాం మనోహర్ రావు, డాక్టర్ శైలజ, అశోక్ మరియు ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post