క్షయ రహిత జిల్లాగా మారుద్దాం…..అదనపు కలెక్టర్ వీరారెడ్డి

క్షయ రహిత జిల్లాగా మారుద్దాం…..అదనపు కలెక్టర్ వీరారెడ్డి

జిల్లాను క్షయ రహిత జిల్లాగా ఏర్పాటు చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు.

ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్తు కార్యాలయం నుండి నిర్వహించిన ర్యాలీకి ఆయన జండా ఊపి ప్రారంభించారు.

అనంతరం టిఎన్జీ ఓ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరారెడ్డి మాట్లాడుతూ “Yes we can end TB.” అని పిలుపు
నిచ్చారు. ఒకప్పటి కంటే ఇప్పుడు టిబికి మెరుగైన మందులు అందుబాటులో ఉన్నాయని,ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స,మందులు ఇస్తారని, సరైన విధానంలో మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతుందని, క్షయవ్యాధికి బయపడకుండా లక్షణాలు కనిపిస్తే దగ్గరలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోవాలని సూచించారు.నిర్లక్ష్యం చేయవద్దని హితవు పలికారు. వ్యాధి లక్షణాలు,చికిత్స తదితర విషయాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. గాయత్రీ దేవి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే 2025 సంవత్సరం నాటికి క్షయ వ్యాధిని నిర్ములించగలుగుతామన్నారు. టిబి వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం కోసం నెలకు 500 రూపాయలు వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు.

జిల్లా క్షయ నియంత్రణ అధికారికి డా. రాజేశ్వరి మాట్లాడతూ క్షయ వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలన్నారు.

జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డా. వాణీ మాట్లాడుతు టిబి నిర్ధారణ పరీక్షల కోసం (NAAT) నాట్ పరికరాలను ఉపయోగిస్తున్నామన్నా రు.

ఐ ఎ పి ప్రెసిడెంట్ డా. చక్రపాణి మాట్లాడుతూ TB నిర్మూలన కోసం ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ కలిసి కట్టుగా పని చేస్తున్నాయని అన్నారు.

అనంతరం టిబి నియంత్రణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఉత్తమ సేవ పురస్కరాలను, జ్ఞాపికలను అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గాయత్రీ దేవి, జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ పిన్సిపల్ డా. వాణి , జిల్లా క్షయ నియంత్రణ అధికారి రాజేశ్వరి, ఐ ఎం ఎ ప్రెసిడెంట్ డా. ఉషాకిరణ్ , ఐ ఎ పి ప్రసిడెంట్ డా. చక్రపాణి ,ఎం ఎన్ ఆర్,మహేశ్వర మెడికల్ కళాశాలల డాక్టర్లు, విద్యార్థులు, టిబి అలర్ట్ ఇండియా, స్కోప్ NGO’s, విద్యార్థులు. తదితరులు పాల్గొన్నారు.

Share This Post