క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ తెలిపారు.
ముందుగా ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ శ్రీ కల్నల్ సంతోష్ బాబు విగ్రహం దగ్గర నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజీ వరకు నిర్వహించడం జరిగింది . *జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ పాటిల్ హేమంత కేశవ్ జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు*. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నందు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలనకు వైద్య శాఖ, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా పోరాడినప్పుడే వ్యాధి నియంత్రణ జరుగుతుందని అధనపు కలెక్టర్ తెలిపారు. క్షయ వ్యాధి పరీక్షలలో జాప్యం తగదని రెండు వారాల పాటు తడి పొడి దగ్గుతూ ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. దీనిపై గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అనంతరం క్షయ వ్యాధి నిర్మూలనకు అంకితభావంతో కృషి చేసిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం.. టీబి 2025.. నాటికి అంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అదనపు కలెక్టర్ అందరిచే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ శ్రీనివాసరాజు ,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ,డాక్టర్ ఈశ్వరమ్మ ,డాక్టర్ మౌనిక క్షయ నివారణ ఫీల్డ్ స్టాఫ్ ఆశాలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు ,వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
———————————————–
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సూర్యాపేట జిల్లా వారిచే జారీ చేయనైననది.