క్షయ వ్యాధి నిర్ములనకు కృషి చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 07, 2021ఆదిలాబాదు:-

క్షయ వ్యాధి నివారణకు నిర్దిష్టమైన ప్రణాళికలతో వివిధ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో క్షయ వ్యాధి నివారణపై జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్య సిబ్బంది గ్రామాలలో పర్యటన సమయంలో క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించి నివారణకు చికిత్సలు అందించాలని, పౌష్ఠిక ఆహారం తీసుకునేవిధంగా వివరించాలని, నిర్ణిత సమయానికి మందులు వేసుకునే విధంగా తెలియజేయాలని అన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామపంచాయితీ అధికారులతో సమన్వయము చేసుకుంటూ వ్యాధి నివారణకు ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆరు మాసాలకు సమావేశం కాకుండా నెలసరి సమీక్షలు నిర్వహించాలని, రోగుల ఇండ్లకు వెళ్లి వారికీ కావలసిన మందులు, పౌష్ఠిక ఆహారంగా అందించాలని అన్నారు. తరచుగా ఆరోగ్య సమస్యలు పరిశీలించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ మాట్లాడుతూ, క్షయ వ్యాధి గ్రస్తులకి ఆరు మాసాల చికిత్స అందిస్తూ పర్యవేక్షణ చేయడం ద్వారా మరణాలను నివారించ వచ్చని, గిరిజన ప్రాంతాలలో అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజల భాగస్వామ్యం, కమ్యూనిటీ సహకారంతో వ్యాధిని అరికట్ట వచ్చని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డా.జి.శ్రీగణ మాట్లాడుతూ, ఫోరమ్ యొక్క లక్ష్యాలు, ప్రణాళికలు వివరిస్తూ వ్యాధి నిర్ములించుటలో ఎదురయ్యే ఆవంతరాలు, జిల్లా ప్రగతి తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో డా.విద్య విల్సన్, డా.జమీర్, డా.ఈశ్వర్ రాజ్, డా.సందీప్ జాదవ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ డా.శ్రీకాంత్, కో ఆర్డినేటర్ చెన్న మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post