ప్రచురణార్థం
మహబూబాబాద్ మార్చి 24.
క్షయ వ్యాధి నిర్మూలనకు సంయుక్తంగా పోరాడితేనే వ్యాధిని సమూలంగా అరికట్టవచ్చునని జిల్లా కలెక్టర్ శశాంక తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
శుక్రవారం ఐడిఓసి లోనే సమావేశ మందిరంలో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
క్షయ వ్యాధి నిర్మూలనకు వైద్యశాఖ కృషి ఒక్కటే సరిపోదని స్వచ్ఛంద సంస్థలు ప్రజలు సంయుక్తంగా పోరాడినప్పుడే వ్యాధి నియంత్రణకు కృషి చేసినప్పుడే క్షయ వ్యాధి రహిత గ్రామాలుగా చూడగలుగుతామన్నారు.
శాంపిల్స్ సేకరణ లక్ష్యంగా కాదని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా శాంపిల్స్ సేకరణ పెట్టుకోవాలని అప్పుడే క్షయ వ్యాధి నిర్మూలన సాధ్యమవుతుందన్నారు.
జిల్లాలోని ప్రతి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహించాలన్నారు ప్రజలు కూడా క్షయ వ్యాధి పరీక్షలలో జాప్యం తగదని రెండు వారాలపాటు తడి పొడి దగ్గుతో ఉన్నవారు మొహమాట పడకుండా రోగాలను దాచుకోకుండా నిర్మోహమాటంగా వైద్యుల వద్ద చెప్ప గలగాలని తద్వారా ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించే పరిస్థితి ఉండదన్నారు క్షయ వ్యాధి వైద్యంలో తాత్కాలిక ఉపశమనం తగదని శాశ్వత నిర్మూలన కొరకు చర్యలు తీసుకుంటేనే తప్ప పరిష్కారం ఉండదని ఈ విషయం నిరుపేదలు గ్రహించగలగాలన్నారు.
ప్రచార కార్యక్రమాలపై ప్రధాన దృష్టి పెట్టాలన్నారు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలన్నారు.
కోవిడ్ వలన ప్రజలు ఆరోగ్యం విషయమై ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టడం జరిగిందని అదే రీతిలో క్షయ వ్యాధిపై కూడా ముందస్తు చర్యలు పైనే వైద్యులు దృష్టి పెడుతూ క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలన్నారు క్షయ వ్యాధి నిర్మూలనలో జిల్లా ప్రథమ స్థానం చేరుకునేందుకు వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు.
జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలలో క్షయ వ్యాధి పరీక్ష లకు చర్యలు తీసుకుంటామన్నారు డాక్టర్లు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు కలిసి సంయుక్తంగా క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తామన్నారు.
అనంతరం క్షయ వ్యాధి నిర్మూలనకు అంకితభావంతో కృషిచేసిన సిబ్బందికి వ్యాసర సేన పోటీలు లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందించి కలెక్టర్ అభినందించారు
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు వెంకట రాములు క్షయ వ్యాధి నిర్మూలన కోఆర్డినేటర్ మురళీధర్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఉపవైద్యాధికారులు అంబరీష రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు వెంకట వరప్రసాద్ ప్రముఖ ఫిజీషియన్ రూపులాల్ వైద్యశాఖ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.