క్షయ వ్యాధి లక్షణాల గురించి అందరికీ తెలిసేలా అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

క్షయ వ్యాధి లక్షణాల గురించి అందరికీ తెలిసేలా అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.
శుక్రవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ అధికారులు, ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు , పాఠశాలల విద్యార్థులు క్షయ వ్యాధి నిర్మూలనపై చేపట్టిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి చికిత్స కొరకై సరైన మార్గం చూపించాలని కలెక్టర్ సూచించారు. క్షయ వ్యాధి నివారణ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ అన్నారు. క్షయ వ్యాధి వచ్చినవారు పూర్తి కాలం మందులు వాడాలని అప్పుడే క్షయ వాదిని పూర్తిగా నయం చేయవచ్చునని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. వ్యాధి సోకిన వారికి అన్ని పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయడంతో పాటు ఉచిత చికిత్స అందించడం జరుగుతుందని విషయం కూడా స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. క్షయ వ్యాధి నిర్ధారణ జరిగినట్లయితే ప్రతినెల పోషణ భత్యం కింద చికిత్స పూర్తి అయ్యేవరకు నెలకు 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. క్షయ వ్యాధి అంతానికి అందరం కలిసి పని చేయాలని, చేయని వారిని మన జీవిత ఆశయంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా క్షయ వ్యాధి నివారణ పై ప్రతిజ్ఞ చేసిన అనంతరం ప్లే కార్డుల ప్రదర్శనతో కలెక్టర్ కార్యాలయం నుండి మొదలుకొని వికారాబాద్ పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పాల్వన్ కుమార్ , క్షయ వ్యాధి ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ రవీందర్ యాదవ్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ లతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post