క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
ప్రచురణార్థం–1 తేదిః 16-08-2021
క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, అగస్టు 16: జిల్లాలోని వివిధ మండలాల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల నిర్వహణను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం స్థానిక ఐఎంఏ హలులో వివిధ శాఖల అధికారులతో కన్వర్జేన్సి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ కార్యక్రమాల నిర్వహణలో పలు ఆరోపణలు వస్తున్నందున ప్రత్యేక అధికారులు ప్రతి పనుల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టాలని అన్నారు. బృహత్ పల్లెప్రకృతి వనాల కొరకు స్థలాలను గుర్తించి మొక్కలు నాటే పనులు చేపట్టాలని, అనువైన స్థలం లభించనట్లయితే ఒకే చోట కాకుండా సమీపంలో స్థలాలను గుర్తించాలని పేర్కోన్నారు. హరతహారం కార్యక్రమంలో బాగంగ, వివిధ శాఖల కేటాయించిన లక్ష్యాల మేరకు యాక్షన్ ప్లాన్ రూపొందించి, ఆ దిశగా ఏర్పాట్లు జరగాలని అన్నారు. అటవి ప్రాంతాలలో నాటే మొక్కలలో పూలమొక్కలను నాటకూడదని, లక్ష్యాల మేర నాటడానికి మొక్కలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తపడాలని పేర్కోన్నారు. స్థీరాస్థులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు శాఖల పేరునే ఉన్నాయా ధరణిలో చూసుకోవాలని, లేని వాటిని మీపేరున మార్పు జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కోన్నారు. గ్రామాలు, మండలాలు మరియు పట్టణాలలో వర్షాల వలన లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరునిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని, గంబుషియా చేపలను తెప్పించి మురుగుకాలువలు, దోమలు ఎక్కువగా తయారయ్యే ప్రాంతాలలో విడిచిపెట్టెలా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. ఫీవర్ సర్వే ఎప్పడు జరగాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన డయోగ్నిస్టిక్ కేంద్రం ద్వారా వ్యాదిగ్రస్తులు ఇక్కడి వరకు రాకుండా ఎ.ఎన్.ఎమ్. లు సాంపీల్లను సేకరించి పిహెచ్సి ల ద్వారా డయోగ్నిస్ట్ కేంద్రానికి పంపించాలని, వారికి ఫలితాలను వారి ఫోన్ నెంబర్ కు పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టిపిసిఆర్ కేంద్రం ద్వారా 300 పరీక్షలు జరపాలని, 57 సంవత్సరాల కన్న ఎక్కువ, 64 సంవత్సరాల కన్న తక్కువగా ఉన్న వారిలో పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని, మీ సేవా కేంద్రాలలో అధిక ఫీజలు వసూలు చేయకుండా తనిఖీలు నిర్వహించి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. పుట్టిన తేది దృవీకరణల కరెక్షన్ లో ఖచ్చితమైన దృవీకరణలు సమర్పించిన వాటిని మాత్రమే మంజూరు చేయాలని సూచించారు.
ఈ కార్యకమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జే. అరుణశ్రీ, కోరుట్ల ఆర్డిఓ టి. వినోద్ కుమార్, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి ఆర్.డి. మాదురి, డిఆర్డిఓ పిడి ఎస్. వినోద్, అన్ని శాఖల అధికారులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది
క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
