ఖమ్మం జిల్లాలో 122 మద్యం షాపులకు లాటరీ పద్ధతిన కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.పి. గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం

నవంబరు, 20, ఖమ్మం:

ఖమ్మం జిల్లాలో 122 మద్యం షాపులకు లాటరీ పద్ధతిన కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.పి. గౌతమ్ తెలిపారు. శనివారం ఖమ్మం నగరంలోని సీక్వెల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మధ్యం షాపులు కేటాయింపు ప్రక్రియలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పాల్గొని లాటరీ పద్ధతిన 122 షాపులకు  విజేతలను ఎంపిక చేసారు. జిల్లాలో 122 మద్యం దుకాణాలకు గాను 6212 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. లాటరీ ద్వారా ఎంపికైన మద్యం షాపుల విజేతలు లైసెన్స్ సీజలో 1/6వ వంతు పైకాన్ని శనివారం రోజే సీక్వెల్ హాల్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యాంక్ కౌంటర్ నందు నగదును జమచేసారని. ఇట్టి నగదు జమ చేసిన వారందరికి ప్రొవిజనల్ లైసెన్స్లు జారీచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. లాటరీ ద్వారా జరిగిన ఎంపిక ప్రక్రియలో 122 మద్యం షాపులకు గాను 20 మద్యం షాపులకు మహిళలు విజేతలుగా ఎంపికయ్యారని కలెక్టర్ తెలిపారు.

పోలీసు కమిషనర్ విష్ణు యస్ వారియర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏ. అంజన్ రావు, జిల్లా ప్రోలిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సోమిరెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post