ఖమ్మం జిల్లా చింతకాని మండలంకు దళితబంధు పథకం లబ్ధి అమలుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె. చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రచురణా

సెప్టెంబరు 01 ఖమ్మం:

ఖమ్మం జిల్లా చింతకాని మండలంకు దళితబంధు పథకం లబ్ధి అమలుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె. చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. దళితబంధు పథకం అమలుకు హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లా చింతకాని మండలం ను గౌర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. దళితుల అభ్యున్నతి కొరకు ముఖ్యమంత్రివర్యులు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంను గత నెల 16న హుజురాబాద్ లో లాంఛనంగా ప్రారంభించి ఇప్పుడు రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాల ఎంపికలో భాగంగా మధిర నియోజకవర్గం చింతకాని మండలంను ఎంపిక చేయడం పట్ల ఖమ్మం జిల్లా దళితుల పక్షాన ముఖ్యమంత్రివర్యులకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post