ఖమ్మం జిల్లా యువతకు స్థానికంగా కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగపర్చుకొని ఉన్నత స్థాయికి చేరుకొని ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తేవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 27 ఖమ్మం:

. ఖమ్మం జిల్లా యువతకు స్థానికంగా కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగపర్చుకొని ఉన్నత స్థాయికి చేరుకొని ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తేవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మం ఐ.టి. హల్ నందు టెక్ స్కై, యూనికాన్ కంపెనీలలో నియమితులైన 16 మంది ఉద్యోగులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నియామకపు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువత ఇతర ప్రదేశాలకు వెళ్లకుండా ఖమ్మంలోనే ఐ.టి. హబ్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో పాటు వివిధ రంగాలలో ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే ఐ.టి హబ్ లో ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించాయని దీనిలో భాగంగా నేడు మరో రెండు కంపెనీలలో 16 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో టెక్నొజన్ అధినేత, ఐ. టి హబ్ కో-ఆర్డినేటర్ ల్యాక్స్ చేపూరి ఆయా కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలు పొందిన యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post