ప్రచురణార్ధం
ఆగష్టు 04 ఖమ్మం:
ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ప్రజ్ఞ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ, కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. నగరంలో ఫుట్పాత్లు ఏర్పాటుకు గుర్తించిన మోడల్ రోడ్లను రోడ్లు భవనాల శాఖ, మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్లాన్ ను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గోళ్ళపాడు ఆధునీకరణ పనులలో భాగంగా ఇంకనూ పెండింగ్లో ఉన్నపైప్ లైన్, ఎస్.టి.పి. చైన్ లింక్ ఫెన్సింగ్, మ్యాన్పోల్స్, స్మార్ట్ వాటర్ డ్రైన్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఇప్పటికే పైప్ లైన్ పనులు పూర్తి చేసుకొని ఆధునీకరించుకున్న ప్రదేశంలో ఫార్మ్స్, ఫెన్సింగ్, వీధి వ్యాపారుల ప్రాంగణం, ప్లే గ్రౌండ్స్, ఓపెన్ జిమ్స్, గ్రీనరీ ఏర్పాటుకు పాలకవర్గం తీర్మానం ప్రకారం సత్వర చర్యలు చేపట్టాలన్నారు. నగర సుందరీకరణలో భాగంగా ప్రజల అవసరాలకనుగుణంగా వసతులను అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ ప్రకారం పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ నగరాభివృద్ధి పనులలో అధికారులకు పాలకవర్గం. సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని, తాము కూడా నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, నగరపాలక సంస్థ ఎస్.ఇ ఆంజనేయప్రసాద్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సురేష్ నగరపాలక సంస్థ ఇఇ కృష్ణలాల్, డి.ఇలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.