ఖమ్మం నగరంలో పాదచారులకు సకల సౌకర్యాలతో త్వరలోనే అందుబాటులోకి రానున్న ఫుట్‌పాత్ ప్రాజెక్టు పనులను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పోలీసు కమిషనర్ విష్ణు. యస్ వారియర్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి పరిశీలించారు.

ప్రచురణార్ధం

జనవరి,06 ఖమ్మం

ఖమ్మం నగరంలో పాదచారులకు సకల సౌకర్యాలతో త్వరలోనే అందుబాటులోకి రానున్న ఫుట్‌పాత్ ప్రాజెక్టు పనులను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పోలీసు కమిషనర్ విష్ణు. యస్ వారియర్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి పరిశీలించారు. కలెక్టరేట్ కార్యాలయం నుండి ఐ.టి హబ్ వరకు కాలినడకన ఫుట్‌పాత్ పనులను వారు పరిశీలించి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేసారు. కలెక్టరేట్ వద్ద గౌరవ రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మాత్యులు కె. తారకరామారావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించనున్న ఫుట్‌పాత్ ప్రాజెక్టు శిలాఫలకం ఏర్పాట్లను కలెక్టర్, పోలీసు కమిషనర్ పరిశీలించారు. ఫుట్ పాత్ పై కేవలం పాదచారులు మాత్రమే నడిచే విధంగా ఉండాలని, ఫుట్‌పాత్ విశాలంగా ఉన్నచోట కూర్చునేందుకు బెంచ్‌లను ఏర్పాటు చేయాలని, ఫుట్ పాత్ పై ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పోల్స్ ను ప్రక్కకు మార్చాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటికే ఫుట్‌పాత్ పై ఉన్న మొక్కలకు రక్షణ వలయాలు ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఫుట్‌పాత్‌పై ఎటువంటి వీధివ్యాపారాలు కొనసాగకుండా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఫుట్‌పాత్ ముందు పార్కింగ్, నో- పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఫుట్‌పాత్ కు అనుసంధానంగా ఉన్న అంతర్గత వీధి నుండి ప్రధాన రహదారి ప్రవేశ మార్గాల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు గాను స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్, పోలీసు కమిషనర్ ఆదేశించారు. నగరంలో సెల్లార్లో కేవలం పార్కింగ్‌కు మాత్రమే ఉపయోగించేలా తగు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసు అధికారులకు వారు సూచించారు.

అడిషనల్ డి.సి.పిలు సుభాష్ చంద్రబోస్, గౌస్ అలామ్ ఖాన్, టౌన్, ట్రాఫిక్ ఏ.సి.పిలు అంజనేయులు, యస్. రమేష్, నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు కృష్ణలాల్, డిఇ స్వరూపారాణి, విద్యుత్ శాఖ డి.ఐ. రామారావు, ట్రాఫిక్ సి.ఐ.లు అంజలి, సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post