ఖమ్మం నగరంలో పురోగతిలో ఉన్న వివిధ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

నవంబరు, 09, ఖమ్మం:

ఖమ్మం నగరంలో పురోగతిలో ఉన్న వివిధ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి, నగరపాలక సంస్థ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, ఏజేన్సీ బాధ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరంలో మిషన్ భగీరథ పథకం కింద జరుగుతున్న మంచినీటి పథకం పనులు, గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ, పుట్పాత్, లకారం ట్యాంక్ బండ్ సస్పెన్షన్ బ్రిడ్జి తదితర పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో మిషన్ భగీరథ కింద చేపడ్తున్న మంచినీటి పథకం పనులలో భాగంగా ఇంకనూ 12 వా టర్ ట్యాంకుల పనులు పురోగతిలో ఉన్నాయని నెలాఖరులోగా అట్టి పనులను పూర్తి చేయాలని సబంధిత ఏజెన్సీ. బాధ్యులను కలెక్టర్ ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతివారం ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా గోళ్ళపాడు చానల్ ఆధునీకరణ ముగింపు పనులను కూడా మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. లకారం ట్యాంక్ బండ్ నందు ఏర్పాటు చేస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి, ఇప్పటికే ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటేన్, తదితర పనులపై కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు సూచనలు ఆదేశాలు చే సారు.

శిక్షణ కలెక్టర్ బి.రాహుల్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రంజిత్ కుమార్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు కృష్ణలాల్ , రంగారావు, ఎల్.అండ్ .టి ప్రాజెక్టు మేనేజర్ హరిప్రసాద్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post