ఖమ్మం నగరంలో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు కనువిందు చేశాయి. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవవందనం స్వీకరించారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 15:

ఖమ్మం నగరంలో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు కనువిందు చేశాయి. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవవందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలలో ఖమ్మం జిల్లా పురోగతిని ప్రజలకు తెలియజేసారు. ఈ సందర్భంగా జిల్లాలో 57-64 సంవత్సరాల వయస్సు వారి దరఖాస్తులు, పెండింగ్ లో వున్న పెన్షను దరఖాస్తులకు సంబంధించి 49,091 మందికి క్రొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరుకాగా, వాటికి సంబంధించిన ఆసరా గుర్తింపు కార్డులను మంత్రి పంపిణీ చేశారు. బ్యాంకు లింకేజి క్రింద 1488 స్వయం సహాయక సంఘాలకు 100 కోట్ల చెక్కు పంపిణీ చేశారు. మిర్చి కొనుగోలు చేసిన (3) ఎఫ్పివో లకు రూ. 86 లక్షల కమీషన్ ను మంత్రి పంపిణీ చేశారు. ప్రధానమంత్రి స్వానిది క్రింద 250 మంది వీధి వ్యాపారులకు 5 కోట్ల రూపాయల పంపిణి చేశారు. దళితబందు పథకం క్రింద చింతకాని మండలంలోని 11 గ్రామాలలో 26 మంది లబ్దిదారులకు రూ. 2.5 కోట్ల విలువ గల డ్రోన్ స్పెయర్, ఎక్స్ రే మిషన్, కాంక్రీట్ మిల్లర్లు, ట్రాలీ ఆటోలు, గూడ్స్ వాహనాలు, హార్వేస్టర్లు, మినీ రైస్ మిల్లు, డయాగ్నస్టిక్ సెంటర్, ఫెర్టిలైజర్ షాప్, ఫోటోగ్రఫీ, విదియోగ్రఫీ, టైలరింగ్ తదితర యూనిట్ల పంపిణీ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ కు సంబంధించి రూరల్ ట్రాన్స్ పోర్ట్ పధకం క్రింద ఇద్దరు ఎస్టి లబ్దిదారులకు రూ. 10.80 లక్షల అంచనా విలువ గణ రవాణా వాహనాలు పంపిణీ చేశారు. మిర్చి, కూరగాయల నర్సరీలకు చెందిన 5 గురు లబ్దిదారులకు లైసెన్స్ పత్రాల పంపిణీ చేశారు. పామాయిల్ సాగుకు డ్రిప్ పరికరాల కోసం 5 యూనిట్లకు గాను రూ. 36 లక్షల సబ్సిడీ కు పరిపాలన మంజూరు ఉత్తర్వుల పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి గిరి వికాసం క్రింద సత్తుపల్లి మండలం నుండి 7 గురు లబ్దిదారులకు రూ. 5.25 లక్షల అంచనా విలువ గల మోటార్లు పంపిణీ చేశారు. మత్స్య శాఖ కు సంబంధించి రూ. 0.55 లక్షల అంచనా విలువతో 10 మంది ఎస్టి గ్రూపులకు తెప్పలు, వలలు పంపిణీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా 10 మంది ఎస్టి బాలికలకు రూ. 29 వేల అంచనా విలువ గల కిషోర్ బాలికల న్యూట్రీషణ్ కిట్ల పంపిణీ చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ను సన్మానించారు. వేడుకల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. వ్యవసాయ, ఉద్యానవన, అటవీ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, స్త్రీ-శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, మునిసిపల్, సంక్షేమ, నీటిపారుదల శాఖలు వారి వారి శాఖల కార్యక్రమాల గురించి తెలిపే శకటాల ప్రదర్శన వేడుకల్లో ప్రత్యెక ఆకర్షణగా నిలిచాయి. వివిధ శాఖలచే ఏర్పాటుచేసిన స్టాళ్లను మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు.

స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సి తాతా మధు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డిసిఎంఎస్ చైర్మన్, రాయల శేషగిరి రావు, జిల్లా జడ్జి డా. టి. శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలిస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ లక్ష్మి ప్రసన్న, మధిర మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, ఖమ్మం డిప్యూటి మేయర్ ఫాతిమా జోహారా, అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహలత, ఎన్. మధుసూదన్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post