ఖమ్మం నగరంలో 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో రాష్ట్ర రవాణా శాఖమంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ జాతీయపతాకావిష్కరణ గావించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు

ప్రచురణార్ధం

ఆగష్టు 15 ఖమ్మం:

ఖమ్మం నగరంలో 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో రాష్ట్ర రవాణా శాఖమంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ జాతీయపతాకావిష్కరణ గావించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆంగ్లేయుల పాలన నుండి మనదేశానికి విముక్తి కలిగించేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులందరికి మంత్రి జోహార్లర్పించారు. స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్న మనకు మహానీయుల త్యాగాలు స్ఫూర్తిదాయకం కావాలని దేశ, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు క్రియాశీలకభాగస్వామ్యులు కావాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లాలో కరోనా విపత్కర పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో జిల్లా యంత్రాంగం అందించిన విశేశసేవలు ప్రశంసనీయమన్నారు. కరోనా బాధితులకోసం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 320 పడకల ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి 25, 157 మంది రోగులకు వైద్య సేవలందించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3 లక్షల 66 వేల 420 మందికి ఫస్ట్స్, 98 వేల 676 మందికి సెకండ్స్ కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 2 కోట్ల 15 లక్షలతో సిటీ స్కానన్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. జిల్లాలో 50 వేల లోపు రుణాలు పొందిన 33 వేల 575 మంది రైతులకు 106.08 కోట్లు ఋణ మాఫీ జరిగిందన్నారు. జిల్లాలో 29 కోట్లతో 129 రైతువేదికలను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి తెలిపారు. హరితహారం క్రింద గత ఏడు ఏండ్లలో 9 కోట్ల 26 లక్షల మొక్కలను వాటినట్లు మంత్రి తెలిపారు. 7.09 కోట్లతో 12.89 లక్షల మొక్కలు నాటుకొని పల్లె ప్రకృతి వానలను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి తెలిపారు. 1308 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా 959 గ్రామాలకు శుద్ధిచేసిన మంచినీటి సరఫరా జరుగుతుందన్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగానికి ఈ నెల 5న సాగునీటిని విడుదల చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 70.4 టి. ఎంసీల గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 890 కోట్లతో 766.65 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. 119,05 కోట్లతో 10 బ్రిడ్జ్ కం చెక్ఇడ్యామ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 16 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు విద్యుత్తైన ఆధునీకరణ పనులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు. 178.80 కోట్లతో 292 పరిశ్రమల ద్వారా 1418 మందికి ఉపాధి లభింపచేసే పరిశ్రమలకు అనుమతులిచ్చినట్లు మంత్రి తెలిపారు. 2 వందల కోట్లతో 15 వేల 370 మందికి గొర్రెల యూనిట్లను అందించామన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 75 శాతం సబ్సిడీపై 46 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 93.38 కోట్లతో 49.44 లక్షల పనిదినాలను ఎస్.ఆర్.ఈ.జి.ఎస్. క్రింద కల్పించడం జరిగిందన్నారు. 1,57,957 మంది ఫించన్ దారులకు ఆసరా ఫించన్లకు 138.29 కోట్లు చెల్లించామన్నారు. 4036 గ్రూపులకు 147.25 కోట్లు బ్యాంకు లింకేజి ఋణాలు అందించినట్లు మంత్రి తెలిపారు.  ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనారిటీ సంక్షేమానికి గాను ఉపకార వేతనాలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఫీజు రీ-ఇంబర్స్మెంట్ వంటి సంక్షేమ కార్యక్రమాలను నిరంతరాయంగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. షాదిముబారక్/కళ్యాణలక్ష్మి పథకం క్రింద ఇప్పటి వరకు 30721 మందికి 277 కోట్లు అందించడం జరిగిందన్నారు. జిల్లాకు మంజూరైన 14,555 డబుల్ బెడ్రూమ్ గృహాలలో ఇప్పటివరకు 4269 గృహాలను పూర్తిచేసి 2958 గృహాలను లబ్ధిదారులకు అందించినట్లు మంత్రి తెలిపారు. 36 కోట్లతో 60 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 15 గోదాములను ఏర్పాటు చేసుకున్నామన్నారు. గత మాసంలో 12,111 కొత్త రేషన్ కార్డులను లబ్దిదారులకు అందించామన్నారు. జిల్లాలో రవాణా శాఖ ద్వారా 59 వివిధ రకాల సేవలను అందిస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరానికి 91.47 కోట్ల లక్ష్యాన్ని సాధించామన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం 25 కోట్లతో నూతన ఆర్.టి.సి బస్టాండ్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. క్రీడల అభివృద్ధిలో భాగంగా 1 కోటి 30 లక్షలతో సర్దార్ పటేల్ స్టేడియంలో క్రీడా సౌకర్యాలను అభివృద్ధిపర్చినట్లు .మత్రి తెలిపారు. 67.32 కోట్లతో 589 వైకుంఠధామాలు, 77 కోట్లతో 16 పి. ఎం.జి. ఎస్వైరోడ్లు, మరో 16 కోట్లతో 3 వంతెనల పనులు జిల్లాలో చేపట్టినట్లు మంత్రి తెలిపారు. నగర అభివృద్ధిలో భాగంగా 4 కోట్లతో కారం ట్యాంక్ బండ్ ఆధునీకరించుకున్నామని, 41.24 కోట్లతో మోడల్ రోడ్లు ఏర్పాటు చేసుకున్నామని, 3 కోట్లతో బల్లేపల్లిలో అత్యాధునిక వైకుంఠధామం ఏర్పాటుతో పాటు 2 కోట్లతో కాల్వఒడ్డు వైకుంఠధామాన్ని ఆధునీకరించుకున్నామన్నారు. 14 కోట్లతో నిర్మిస్తున్న నూతన మున్సిపల్ భవనాన్ని త్వరలోనే ప్రారంభించుకోనున్నామని తెలిపారు. 229 కోట్లతో అమృత్ మిషన్ భగీరథ ద్వారా నగర ప్రజలకు శుభ్రమైన త్రాగునీటి పంపిణీ జరుగుచున్నదని, 77 కోట్లతోధంసలాపురం ఆర్.ఓ బిని పూర్తి చేసుకున్నామని ఎన్.ఎస్.పి క్యాంపు నందు 3.5 కోట్లతో సమీకృత వెజ్ నాన్-వెజ్ మార్కెట్ను ఏర్పాటు చేసుకున్నామని, 4.51 కోట్లతో ఎన్.ఎస్.పి వాక్ వే, కోటి 55 లక్షలతో ఖానాపురం ఊరచెరువును మినీ ట్యాంక్ బండి అధునీకరించుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా 27 కోట్లతో ఐటి హబ్ను ఏర్పాటు చేసుకొని ఖమ్మం, జిల్లా నిరుద్యోగ యువతకు స్థానికంగానే వివిధ రంగాలలో ఉపాధి కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దళిత సాధికారతకై శ్రీకారం చుట్టిన దళిత బందు పథక ద్వారా ప్రతి నియోజకవర్గానికి 100 కుటుంబాలను ఎంపిక చేసి 10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లను విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోపర్చుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్. పోలీసు కమిషనర్ విష్ణు యస్ వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి లక్ష్మీప్రసన్న, నగర పాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు స్నేహబత మొగిలి, ఎన్.మధుసూధన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ కార్పోరేటర్లు, నగర ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post