ఖమ్మం నగరం టేకులపల్లి డబల్ బెడ్ రూమ్ గృహ సముదాయం ముగింపు పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. అనంతరం కలెక్టరేట్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.

ప్రచురణార్ధం
జూలై, 29 ఖమ్మం:-
డబుల్ బెడ్ రూమ్ గృహసముదాయాల ముగింపు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ గృహసముదాయాలను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ముగింపు దశలో ఉన్న గృహా సముదాయాల పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.

                  అదేవిధంగా నూతన కలెక్టరేట్ భవన సముదాయాల పనులను కలెక్టర్ పరిశీలించారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అదనపు లేబర్ తో నిరంతరాయంగా పనులు జరగాలని గుత్తేదారులను, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పనుల్లో జాప్యం జరుగకుండా నిరంతరం పర్యవేక్షించి పురోగతిని ఎప్పటికప్పుడు తెలియపర్చాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమత శిరీష, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, నగరపాలక సంస్థ ఎస్.ఇ. అంజనేయశాస్త్రి, ఇ.ఇ కృష్ణలాల్, ఆర్. అండ్.బి.ఎస్.ఇ బి.లక్ష్మణ్, ఇ.ఇ. శ్యాంప్రసాద్, ఇ.ఇ.ఐ.డి.సి. విరూపాక్షి, విద్యుత్ శాఖ డి.ఇ. రాములు, మున్సిపల్ డి.ఇ రంగారావు, ఖమ్మం అర్బన్ తహశీల్దారు శైలజ, రఘునాథపాలెం తహశీల్దారు నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు..

—————————————————————————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది

Share This Post